Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శివరాత్రి రోజున శివుణ్ణి ఎలా పూజించాలి...?(Video)

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (21:13 IST)

Widgets Magazine

సాధారణంగా ప్రతి నెలా కృష్ణపక్షమి రోజున శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ఇందులో బహుళశద్ద పక్షమిలో వచ్చే శివరాత్రి చాలా ప్రత్యేకమైనది. కేవలం ఆ ఒక్కరోజున శివుణ్ణి పూజిస్తే చాలు. ఆ సంవత్సరం మొత్తం శివుణ్ణి పూజించినంత ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆ ఒక్కరోజులో శివుణ్ణి పూజిస్తే మనం ఎన్నో జన్మల నుండి చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. అందుకే మన పెద్దలు జన్మకో శివరాత్రి అని అంటారు. అంటే మనం జన్మలో ఒకసారైనా శివుణ్ణి పూజిస్తే చాలు. 
lord Shiva
 
ఒక రోజు శివుణ్ణి పార్వతీదేవి శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసం వుండి రాత్రి నాలుగు జాములలోను మొదట పాలతోను, తరువాత పెరుగుతోనూ, తరువాత నీటితో ఆ తరువాత తేనెతో అభిషేకిస్తే తనకు ప్రీతి కలుగుతుందని చెప్తాడు. మరుసటి రోజు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదని పరమశివుడు భోదిస్తాడు. అంతటి విశిష్టమైన శివరాత్రి రోజున పరమశివుని పూజించే విధానం ఎలాగో తెలుసుకుందాం.
 
మహా శివరాత్రి రోజున ఉదయం 5 గంటలకు నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత శుచిగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గుమ్మాలకు తోరణాలు కట్టి పూజా మందిరాన్ని పూలతో అలంకరించాలి. తెలుపు రంగు బట్టలు ధరించి శివుడు,పార్వతీదేవితో కలిసి ఉన్న ఫొటోకి లేదా లింగాకార ప్రతిమకు గంధం రాసి బొట్టు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. ఆరోజు తప్పకుండా మారేడు దళాలు శివునికి సమర్పించాలి.

అలానే పసుపు రంగు పూలతో గాని తెలుపు రంగు పూలమాలతో శివుణ్ణి అలంకరించాలి. ఆ తరువాత అరటిపళ్ళు, జామకాయలు, తాంబూలం నైవేద్యంగా పెట్టి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివ అష్టోత్తరం, శివపంచాక్షరి మంత్రమును పఠిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్దిస్తాయి. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివస్తోత్రాలు పఠించి శివుని స్మరించడం వల్ల ముక్తిని పొందుతారని శాస్త్రం. వీడియో చూడండి... Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

మహాశివరాత్రి రోజున ఆ మంత్రాలను జపిస్తే..?(Video)

''ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ ...

news

ఒకవైపు శివనామ స్మరణలు - మరోవైపు గోవింద నామస్మరణలు..(Video)

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిలో కపిలేశ్వరస్వామి, శ్రీనివాసమంగాపురం కళ్యాణ వెంకటేశ్వరస్వామి ...

news

మహాశివరాత్రి రోజున శివకళ్యాణం చేయిస్తే?

మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి పువ్వులు, ఫలాలతో శివునికి పూజ ...

news

13న మహాశివరాత్రి.. శివపూజకి ఆ పూవు వాడకండి..

ఫిబ్రవరి 13న మహాశివరాత్రి పర్వదినం వస్తోంది. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేయడం ఉత్తమం. అయితే ...

Widgets Magazine