బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. మహాశివరాత్రి
Written By selvi
Last Updated : సోమవారం, 16 ఫిబ్రవరి 2015 (18:12 IST)

మహాశివరాత్రి: కొబ్బరికాయ, అరటిపండ్లు, నాగమల్లి పువ్వులతో..

భృగమహర్షి శాపాన్ని అనుసరించి ముక్కంటికి ప్రసాదార్హత లేదని శివధర్మ సంగ్రహం అనే గ్రంథం చెబుతోంది. కనుక పరమేశ్వరునికి ఏ పదార్థాన్నైనా నైవేద్యంగా సమర్పించవచ్చు.

అయితే శివుని ప్రసాదంగా ఇచ్చిన ఏ పదార్థాన్ని తిరిగి ఇంటికి తీసుకొనిపోకూడదు. ఆ ప్రసాదాన్ని గుడిలోనే పంచడం లేదా ఆరగించడం చేయాలి. 
 
వాస్తవానికి శివుని ప్రసాదాన్ని గుడిలోని నందివద్దనే విడిచిరావాలని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈశ్వరుని పూజలో పృధ్విలోని సమస్త పదార్థాలు వస్తుగణము చేర్చబడిందనే విషయాన్ని మనం గమనించాలని పురోహితులు చెబుతున్నారు. 
 
ఇంకా మహాశివరాత్రి రోజున మహన్యాసపూర్వకరుద్రాభిషేకం నిర్వర్తించి, 11 మంది వృద్ధ దంపతులకు అన్నదానం, వస్త్ర, దక్షిణలదానం చేసిన వారింట అష్టలక్ష్ములు కొలువైవుంటారు. ఇంకా గోదానము, క్షీరదానం చేసినట్లైతే పదివేల సంవత్సరాలు శివుని సానిధ్యంలో గడిపే అదృష్టం కలుగుతుంది. 
 
ఇదేరోజున శివునికి 11 లీటర్ల ఆవుపాలు, ఆవునెయ్యిలతో మహన్యాసాన్ని జరిపితే అఖండమైన తేజంతో పాటుగా దీర్ఘాయువు కలుగుతుందని పురోహితులు సూచిస్తున్నారు. శివునికి మహాశివరాత్రి రోజున కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి.