Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శివ.. శివ.. అంటే పాపాలు పోతాయి.. శివరాత్రి రోజున ముక్కంటిని దర్శించుకుంటే?

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (19:07 IST)

Widgets Magazine
lord shiva

పూర్వం రాక్షసులు శివరాత్రి పూజ చూసి, సుషుప్తి దశలో శివ శివ అని మంత్ర పఠనం చేశారని, దానితో వారి పాపాలు మటుమాయమయ్యాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన మహాశివరాత్రి పర్వదినం రోజున శివరాత్రి వ్రతం ఆచరించాలని సంకల్పం చేసుకొన్నవారు ఉదయాన లేచి దినకృత్యాలు పూర్తిచేసి స్నానమాచరించి ఆలయానికి వెళ్లాలి. శివుని దర్శనం చేసుకోవాలి. భక్తులు ఉపవాస దీక్ష బూని శివపురాణం చదవాలి. రాత్రి పూర్తి శివనామం జపిస్తూ జాగరణం చేయాలి. శివపురాణ కథలను వినాలి. నాలుగు యామాల పూజ జరపాలి. 
 
అలాగే శివరాత్రి రాత్రి పూట ఆలయాల్లో పూజ జరుగుతుంది. ఆలయ గర్భగుళ్లలోని శివలింగాలని పూలతో, బిల్వపత్రితో అలంకరిస్తారు. రుద్రం, నమకం, చమకం పఠనం జరుపుతారు. ప్రత్యేక అభిషేకాలు జరుపుతారు. శివరాత్రి రోజున శివుని దర్శనం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. శివరాత్రి రోజున శివుడిని దర్శనం చేసుకోవడం ద్వారా శుభకార్యాలు నిర్వహించిన ఫలితం దక్కుతుందని పండితులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

శివరాత్రి రోజున పూజ ఎలా చేయాలి? కైలాస వాసం ప్రాప్తించాలంటే..?

మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే "మహాశివరాత్రి" పర్వదినం చాలా విశిష్టమైనది. సాధారణంగా ...

news

దేవాలయాల్లో ఇచ్చే తీర్థప్రసాదాన్ని నెత్తికి రాసుకుంటున్నారా? కాస్త ఆగండి

గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి మన జుట్టుకు ...

news

షిర్డీ సాయిబాబాకు రూ.28లక్షల బంగారు కిరీటం.. ఇటలీ మహిళ కానుక

ఇటలీ దేశానికి చెందిన ఓ మహిళ రూ.28లక్షల విలువైన బంగారు కిరీటాన్ని షిర్డీ సాయిబాబాకు ...

news

నేడు మాఘ పౌర్ణమి.... ఈ పౌర్ణమి విశేషం ఏమిటంటే?

నేడు మాఘ పౌర్ణమి. దీనినే మహా మాఘి అని కూడా వ్యవహరిస్తారు. అన్ని పౌర్ణమిల్లో కల్లా ఈ ...

Widgets Magazine