రాముడే కాదు... లక్ష్మణుడు కూడా సరిగా లేడు: జెఠ్మలానీ

lord rama
Venkateswara Rao. I|
WD
పేరులోని రామ శబ్దాన్ని పెట్టుకున్న రామ్ జఠ్మలానీ తను శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పాడు. కేవలం ఒక జాలరి చేసిన వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకుని అమాయకురాలైన సీతమ్మను అడవులపాలు చేశాడని అన్నారు.

శ్రీరాముడు మంచి భర్త కాదనీ, అందుకే రాముడంటే తనకు గిట్టదని అన్నారు. శ్రీరాముడే కాదు లక్ష్మణుడి పాత్ర కూడా సరిగా లేదని అన్నారు. లక్ష్మణుడు చూస్తుండగానే రావణుడు సీతమ్మను కిడ్నాప్ చేశాడని చెప్పుకొచ్చారు. ఇలాంటివారి పట్ల తనకు ఎంతమాత్రం గౌరవం లేదని అన్నారు.

రాముడుపై తను చేసిన వ్యాఖ్యల వల్ల భాజపా ఇబ్బందుల్లో పడుతుందన్న ప్రశ్నపై స్పందిస్తూ... భాజపాను బలోపేతం చేసేందుకే తను ప్రయత్నిస్తున్నాని అన్నారు. మొత్తమ్మీద జఠ్మలానీ శ్రీరామచంద్రునిపై వ్యతిరేక వ్యాఖ్యలు భాజపాను ఏ దరికి చేర్చుతాయో చూడాలి.


దీనిపై మరింత చదవండి :