గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (20:45 IST)

డాక్టర్ల నిర్లక్ష్యం ఖరీదు కంటిచూపు పరిహారం.. రూ. 1.8 కోట్లు

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ కుర్రాడు కంటి చూపు కోల్పోయాడు. తమకు ఏమాత్రం సంబంధం లేనట్టు వ్యవహరించిన డాక్టర్లను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. బాధితుడికి 1.8 కోట్ల రూపాయలను పరిహారంగా అందజేయాలని తీర్పు వెలువరించింది.
 
తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి చెన్నైకు చెందిన ఓ కుర్రాడి కంటి చూపు పోవడానికి కారణమయ్యారు. దీనిపై బాధితుడు న్యాయపోరాటం చేశాడు. అతనికి భారీ పరిహారం ఇవ్వాలని బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.