శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (17:03 IST)

భారత్‌లో ప్రతి 4 నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి.. సర్వే

భారత్‌లో జరిగే రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువైనట్టు ఓ స్వచ్చంధ సంస్థ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ ప్రమాదాల కారణంగా ప్రతి 4 నిమిషాలకు ఒకరు చొప్పున మృత్యువాతపడుతున్నట్టు చెప్పారు. 
 
భారత్‌లో రోడ్డు భద్రతపై శనివారం ఢిల్లీలో జరిగిన ఓ సదస్సు జరిగింది. ఇందులో ఈ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వేలో ఈ విషయాలను వెల్లడించింది. భారత్‌లో రోడ్డు భద్రత ఇలానే కొనసాగితే.. 2020 నాటికి ప్రతి మూడు నిమిషాలకు ఒకరు మృతిచెందే ప్రమాదముందని సర్వే నిర్వహించిన సంస్థ ప్రతినిధులు హెచ్చరించారు. 
 
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రోడ్డు నెట్‌వర్క్‌ ఉన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని తెలిపింది. అలాంటి దేశంలో గత పదేళ్లలో 10 లక్షల మంది ప్రజలు కేవలం రోడ్డు ప్రమాదాల్లోనే మృతిచెందారని వారు తెలిపారు. అందులోనే గతేడాది ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోనే జరిగాయని వారు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రం రెండోస్థానంలో నిలిచింది.