శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (10:53 IST)

వామ్మో.. పోలీస్ క్వార్టర్స్‌లో 100కు పైగా అస్థిపంజరాలు!

అమ్మో.. పోలీస్ క్వార్టర్స్‌లో 100కు పైగా అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా కేంద్రంలో ఒకేచోట 100కు పైగా అస్థిపంజరాలు పడివున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీస్ నివాస సముదాయాలలో గత రాత్రి 100కు పైగా అస్థిపంజరాలు బయటపడ్డాయి.
 
ఓ గదిలో సంచుల్లో కుప్పలా ఉన్న ఈ అస్థిపంజరాలను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్పందించిన రాష్ట్ర సర్కారు ఇద్దరు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించింది. అయితే, 2008 వరకు ఈ గదిని మృతదేహాల పోస్టుమార్టం కోసం వినియోగించినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం అనాథ శవాలను వదిలేయగా, అవి కాలక్రమంలో అస్థిపంజరాలుగా మారాయని అధికారులు భావిస్తున్నారు. 
 
కాగా, అత్యంత శీతల ప్రదేశంలో మృతదేహాలు ఉంటేనే అవి నాశనం కాకుండా ఉంటాయి. బయటి వాతావరణంలో రెండో రోజుకే దుర్వాసన వెలువడుతుంది. ఈ నేపథ్యంలో అస్థిపంజరాలు సంవత్సరాల తరబడి సంచుల్లో ఎలా వెలుగుచూడకుండా ఉన్నాయన్నది ప్రశ్నార్థకమయింది.