Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలికను చూశారు.. మాయమాటలు చెప్పారు. బస్సులో ఎక్కించారు.. క్రూరంగా, ఘోరంగా..

హైదరాబాద్, బుధవారం, 12 జులై 2017 (09:10 IST)

Widgets Magazine
rape victim

దారి తప్పి, నిస్సహాయ స్థితిలో తమ వద్దకు వచ్చిని పిల్ల జంతువులను, పక్షులను తోటి జంతువులు, పక్షులు ఏ పరిస్థితుల్లోనూ హాని తలపెట్టవు. కానీ భూమ్మీద ఆ పాపానికి తలపెట్టేది మనుషులే. మనిషి కాటుకు పదేళ్ల బాలికల నుంచి 70 ఏళ్ల ముదుసళ్ల వరకు ఎవరూ సరిపోవడం లేదు. ప్రేమించిన యువకుని కోసం ప్రమాదాన్ని ఊహించకుండా అమాయకంగా పట్టణమార్గం పట్టిన ఆ చిన్నారి బాలికను ముగ్గురు కామాంధులు బస్సులోనే నలిపేశారు. పైగా తాము చేసిన ఘనకార్యాన్ని ఎవరికైనా చెబితే బతకనీయమని హెచ్చరించారు. ఇంటికి చేరిన ఆ తల్లిదండ్రులకు చెప్పగా వారి నేరం బయట పడింది. పాపం పండింది కూడా.
 
కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. బిడ్డలా ఆదరించాల్సిన పదిహేనేళ్ల బాలికపై కామాంధులు కాటేశారు. ప్రేమించిన యువకుని కోసం ఒంటరిగా వచ్చిన బాలిక (15)పై కేఎస్‌ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్‌ బస్సులోనే సామూహిక అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన బాలిక- ఉడుపిలో ఓ కాలేజీ కుర్రాడు ప్రేమించుకున్నారు. ఇద్దరికి విభేదాలు రావడంతో ఆ యువకుడు హావేరి జిల్లా రాణిబెన్నూరుకు వచ్చేశాడు. బాలిక కూడా ఈ నెల 5వ తేదీన మణిపాల్‌ నుంచి కేఎస్‌ఆర్టీసి బస్సులో ఒంటరిగా రాణిబెన్నూరుకు వచ్చింది. ప్రియుని కోసం వీధి వీధి గాలించి కనిపించకపోవడంతో సొంతూరు వెళ్లడానికి 6వ తేదీ రాత్రి రాణిబెన్నూరు బస్టాండ్‌కు చేరుకుంది.
 
బాలిక పరిస్థితిని గమనించిన కేఎస్‌ఆర్టీసి బస్సు డ్రైవర్‌  వీరయ్య హీరేమఠ, కండక్టర్‌ యువరాజ్‌ కట్టెకార్‌తో పాటు మరో డ్రైవర్‌ రాఘవేంద్ర బడిగేరెలు తాము సహాయం చేస్తామంటూ నమ్మబలికారు. బస్సులోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించడంతో మౌనం వహించిన బాలికను మరుసటి రోజు ప్రయాణికులతో పాటు అదే బస్సులో మణిపాల్‌లో దించేసారు. ఇంటికి చేరుకున్న తరువాత ఈ ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఉడుపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉడుపి మహిళా పోలీసులు మంగళవారం ముగ్గరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
 
ఇలాంటి మానవరూపంలో పచ్చి మృగాల పని పట్టాలంటే అరబ్ దేశాల్లోని కఠిన శిక్షలు అమలు చేయాల్సిందే అనే ఆలోచనలు ప్రజల్లో పెరుగుతున్నాయి. పాలకులు ప్రజల మనస్సులను అరబ్ మెంటాలిటీ కింద మార్చేస్తారా లేక ఇలాంటి క్రూర చర్యలను అరికడతారా?
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఫరీద్‌కోట్‌లో సెక్స్‌ రాకెట్ గుట్టురెట్టు.. ఏడుగురు యువతుల అరెస్టు

దక్షిణ పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌లో సెక్స్ రాకెట్‌ను గుట్టురట్టు అయింది. ...

news

డ్రగ్స్ ఇచ్చాడు. పుచ్చుకుంది. డబ్బు ఎగ్గొట్టింది. రూ.6వేల కోసం మర్డర్ చేసేశాడు

మాదక ద్రవ్యాలు అమ్మేవారితో పెట్టుకుంటే పుట్టి మనుగుతుందంటే దానికి తాజా ఉదాహరణ ముంబై సినీ ...

news

మేకిన్ ఇండియాకు బూస్ట్‌లా జీఎస్టీ : మోడీపై చైనా మీడియా ప్రశంసలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై చైనా మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. మోడీ చేపట్టిన మేకిన్ ...

news

‘డ్వాక్రా’ గ్రూపుల నిర్వాహణలో తుఫాను షెల్టర్లు...

ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ లోని 9 తీర ప్రాంత జిల్లాల్లో 138 అత్యాధునిక ...

Widgets Magazine