గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 16 జులై 2017 (17:44 IST)

లోయలో పడిన బస్సు : 16 మంది అమర్నాథ్ యాత్రికుల దుర్మరణం

అమర్‌నాథ్ యాత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు దుర్మరణం పాలైన ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే మరో విషాద ఘటన జరిగింది.

అమర్‌నాథ్ యాత్రలో మరో విషాదం చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు దుర్మరణం పాలైన ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు. ఇంతలోనే మరో విషాద ఘటన జరిగింది. కొంతమంది అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ఒకటి ఆదివారం మధ్యాహ్నం అదుపుతప్పి లోయలో పడింది. రాంబాన్ జిల్లాలోని జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. జేకే02వై-0594 నెంబర్ బస్సు డ్రైవర్ అదుపుతప్పడంతో లోయలోకి దొర్లిపడినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. 
 
ప్రమాద వార్త తెలిసిన వెంటనే రాంబాన్ జిల్లా యంత్రాంగం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సీఆర్‌పీఎఫ్ 90, 40వ బెటాలియన్లు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తీవ్రంగా గాయపడిన యాత్రికులను ఆసుపత్రికి తరలించేందుకు వైమానిక దళ హెలికాప్టర్‌ను సైతం రంగంలోకి దించారు. ఈ ప్రమాద సంఘటనను జమ్మూకాశ్మీర్ పోలీసులు ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. 16 మంది యాత్రికులు మరణించగా, 19 మంది గాయపడిన యాత్రికులను హెలికాప్టర్‌లో చికిత్సకు తరలిస్తున్నామని, మరో 8 మంది స్వల్పంగా గాయపడ్డారని ట్విట్టర్ పోస్ట్‌లో తెలిపారు.