Widgets Magazine Widgets Magazine

20మంది ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారా? పన్నీర్‌కు సపోర్ట్‌గా ఓటేస్తారా? ఓపీఎస్ వేషం వేస్తున్నారా?

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (09:19 IST)

Widgets Magazine

తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయంతో తమిళనాడు రాజకీయాలు ఎటువైపు వెళ్తాయని తేలనుంది. ఇప్పటికే తన వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ క్యాంపు రాజకీయాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, శశికళ క్యాంపులో ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు ఎదురుతిరిగినట్టు సమాచారం. 
 
అయితే ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం మాత్రం తన అధికారాన్ని పూర్తిగా వినియోగించి శశికళకు చెక్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. తాము పన్నీర్‌ సెల్వానికి మద్దతునిస్తామని, తమను విడిచిపెట్టాలని వారు కోరుతున్నట్టు చెప్తున్నారు. అయితే, ఇందుకు అనుమతించని శశి వర్గం బలవంతంగా వారిని బంధించి రిసార్ట్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. వందలమంది శశికళ మనుషులు ఎమ్మెల్యేలు జారిపోకుండా కాపలా కాస్తున్నారని తెలిసింది.
 
ఈ నేపథ్యంలో ఆ 20 మంది ఎమ్మెల్యేలను శశికళ విడిచిపెడతారా? ఆ 20మంది పన్నీర్‌కు మద్దతిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను మూడు గ్రూపులుగా విడిగొట్టి.. ఎవరికి తెలియకుండా వివిధ రిసార్టులకు, బీచ్‌లకు తరలించిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. జయలలితకు అందించిన చికిత్సలు, మరణం వెనుక సందేహాలకు సంబంధించిన అన్ని విషయాల్లోను శశికళ గ్రూపుకు సహాయకుడిగా ఉన్న పన్నీర్‌ సెల్వం విడిపోయిన తరువాత ఉత్తముడిగా వేషం వేసుకుని మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని పీఎంకే నేత రాందాస్‌ విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జయ మరణంపై విచారణ కమిషన్ ఏర్పాటుచేస్తానని ప్రకటించి 24 గంటలు గడిచినా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆయనలో అంకితభావం ఉంటే ఇంతకుముందే ఈ పని చేసుండాలని రాందాస్‌ వ్యాఖ్యానించారు.Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

పన్నీర్ ప్రధాన అస్త్రం అదే... మ్యాజిక్ ఫిగర్ 117... సెల్వం పక్షాన 15 మంది... ఏం జరుగుతుంది?

ముఖ్యమంత్రి కుర్చీ కోసం అసెంబ్లీలో బల నిరూపణ చేసేందుకు తనకు ఓ అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ...

news

తమిళ తకరారు : నిర్ణయం గవర్నర్ చేతిలో.. పన్నీర్ దూకుడు... చిన్నబోయిన శశికళ

తమిళ తకరారు రాజ్‌భవన్‌కు చేరింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం మంకుపట్టి కూర్చొన్న ఆపద్ధర్మ ...

news

వావివరసలు మరిచి విచ్చలవిడితనం... ఒకే కుటుంబంలో నలుగురితో సంబంధాలు...

ఓ కామాంధుడు వావివరసలు మరిచిపోయాడు. కామపైశాచికత్వంతో విచ్చలవిడిగా ప్రవర్తించాడు. ఫలితంగా ...

news

ప్రైవేట్ గూండాల నిఘాలో తమిళ ఎమ్మెల్యేలు: ఔరా శశికళా..!

జయలలితకు లాగే తనకుకూడా నమ్మిన బంటులాగా పడి ఉంటాడనుకున్న పన్నీరు సెల్వం తిరుగుబాటుతో సీఎం ...