శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 జులై 2014 (14:41 IST)

పుణేలో కొండచరియలు విరిగిపడి.. 15మంది మృతి.. 200 మంది?

రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బస్సు, రైలు ప్రమాదాలే కాకుండా కొండచరియలు విరిగిపడటం వంటి ఇతరత్రా యాక్సిడెంట్లు నానాటికి పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు పుణే సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 15మంది మృతి చెందారు. 
 
దాదాపు రెండు వందల మంది శిథిలాల మధ్య చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. 40కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. బుధవారం పుణె సమీపంలోని అంబెగాన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 
 
పుణే  సమీపంలోని అంబేగాన్ తెహిసిల్‌లోని మాలిన్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు. కొండ చరియలు విరగడంతో పెద్దపెద్ద రాళ్లు కిందకు పడ్డాయన్నారు.