Widgets Magazine

కన్నడ కుర్చీ కోసం కమలనాధులు 3 మార్గాలు... ఏంటవి?

మంగళవారం, 15 మే 2018 (21:51 IST)

bjp flag

కర్నాటకలో భారతీయ జనతా పార్టీకి పూర్తి ఆధిక్యత రాకపోవడంతో ఎలాగైనా సీఎం పీఠం కైవసం చేసుకోవాలని కమలనాధులు భావిస్తున్నారు. అందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. కర్నాటక కుర్చీ దక్కాలంటే బీజేపీ ముందు మూడు మార్గాలున్నాయి. సిద్ధరామయ్యను నమ్మి జేడిఎస్‌ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరి గెలిచిన ఎమ్మెల్యేలను ఆకర్షించడం.
 
ఎందుకంటే కుమారస్వామి సీఎమ్ అయితే వాళ్లకి పెద్దగా లాభముండదు గనుక వారిని తమ వైపునకు తిప్పుకోవడం. రెండవది, రేవణ్ణ‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు ఆయన అనుచరులకు మంత్రి పదవులు కేటాయించడం. ఇక మూడవది కాంగ్రెస్‌లో వుండి కుమారస్వామితో బహిరంగ విబేధాలున్న శివకుమార్ వర్గీయలను ఆకట్టుకోవడం ద్వారా తమ ప్రయత్నాలు మమ్మురం చేసే ఆలోచనలో ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు.
 
ఎలాగూ గవర్నర్ బలనిరూపణకు అవకాశం‌ ఇస్తారు గనుక ఈ లోగా ఆపరేషన్ కమలను పూర్తి చేయాలని బీజేపి ఫిక్స్ అయ్యినట్టు సమాచారం. ఇందులో భాగంగానే శ్రీరాములు హుటాహుటిన బెంగుళూరు బీజేపి ఆఫీస్‌కు చేరుకుని మంతనాలు జరుపుతున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Karnataka Bjp Cm Post Karnataka Verdict

Loading comments ...

తెలుగు వార్తలు

news

జాబ్ మేళాకు 1189 మంది నిరుద్యోగులు... 502 మంది ఎంపిక

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సహకారంతో ...

news

గోదావరిలో ఘోర ప్రమాదం... మునిగిపోయిన పడవ

తూర్పు గోదావరి జిల్లాలో కొండమొదలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న లాంఛీ మంటూరు దగ్గర ...

news

గంట ముందుగా ఇంటికి... ఏపీ ప్రభుత్వం ఆఫర్... ఎవరికి?

అమరావతి : రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా గంట ముందుగా ఇంటికి వెళ్లిపోవడానికి ముస్లిము ...

news

కర్ణాటకలో సీఎం పీఠం కోసం రసవత్తర పోరు.. బీజేపీ, కాంగ్రెస్ పోటా పోటీ..

కర్ణాటక ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ...

Widgets Magazine