మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (10:52 IST)

తమిళనాట పెరిగిన ఉత్కంఠ... అజ్ఞాతంలో 40 మంది ఎమ్మెల్యేలు?

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠత తారా స్థాయిలో నెలకొంది. అన్నాడీఎంకే చెందిన 40 మంది ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు. వాస్తవానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ వైపు 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తొల

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠత తారా స్థాయిలో నెలకొంది. అన్నాడీఎంకే చెందిన 40 మంది ఎమ్మెల్యేలు అదృశ్యమయ్యారు. వాస్తవానికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ వైపు 130 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. కానీ, ఈ సంఖ్యపై స్పష్టత లేదు. ఫలితంగా ఉత్కంఠ మరింతగా పెరిగింది. 
 
ప్రస్తుతం శశికళ తరలించిన ఎమ్మెల్యేల్లో కేవలం 90 మంది ఉన్నారనే సమాచారం బయటకు పొక్కడంతో పన్నీర్ సెల్వం ఇంటిలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను మినహాయిస్తే, మరో 40 మంది వరకూ అజ్ఞాతంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేల ఫోన్లన్నింటినీ స్వాధీనం చేసుకున్న శశికళ వర్గం వాటిని స్విచాఫ్ చేశారు. 
 
మిగతా వాళ్లు కూడా ఏ మీడియాకూ చిక్కలేదు సరికదా... వాళ్లెక్కడున్నారో, ఎవరికి మద్దతు ఇస్తారోనన్న ప్రశ్నలకూ సమాధానం ఇంకా లభించలేదు. వీరికి ఎవరైనా నాయకుడు ఉన్నారా? అన్నది కూడా తెలియడం లేదు. దీంతో వీరంతా ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు బయటకు వస్తారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
 
అంతేకాకుండా, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలో 40 మంది వరకు బలమైన సామాజికవర్గమైన దేవర్ వర్గానికి చెందిన వారు ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీపడుతున్న పన్నీర్‌ సెల్వంతో పాటు.. శశికళ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో దేవర్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా రెండుగా చీలిపోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే 40 మంది ఎమ్మెల్యేల్లో 28 మంది శశికళ వైపు మొగ్గుచూపుతుండగా, మిగిలిన 12 మంది పన్నీర్ వైపు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం 40 మంది ఎమ్మెల్యేలు శశికళకు బందీలుగా ఉన్నారు.