బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (12:51 IST)

పెళ్లైన తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలా? నో.. నో..!

పెళ్లైన తర్వాత కూడా తమ ఇంటిపేరు మార్చుకునేందుకు 40 శాతం మందికి పైగా ఒంటరి మహిళలు ఆసక్తి చూపడంలేదని షాదీ డాట్ కామ్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సర్వే వివరాలను షాదీ డాట్‌కామ్ గురువారం విడుదల చేసింది. ఈ సర్వేలో దాదాపు 40 శాతం మంది మహిళలు పెళ్లైన తర్వాత తమ ఇంటి పేరు మార్చుకోవడాన్ని వ్యతిరేకించినట్లు తేలింది. 
 
దేశ వ్యాప్తంగా 24 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న 11,200 మంది మహిళలపై ఈ సర్వే నిర్వహించగా, 40.4 శాతం మంది ఇంటి పేరు మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేశారని సర్వే వెల్లడించింది. 
 
ఇంకా ఈ సర్వేలో తేలిన విషయాలేంటంటే.. వివాహం తర్వాత 27 శాతం మంది తమకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటుండగా, 18 శాతం మంది భర్తలతో పాటు అన్ని బాధ్యతలు పంచుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఇక 14 శాతం మంది మాత్రం తల్లిదండ్రుల్లానే భర్తను కూడా భావిస్తున్నట్టు సర్వే తేల్చింది.