శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (10:29 IST)

పేరుకే కొరియర్ బాయ్.. 47 పాస్‌పోర్టులు....

ఏకంగా 47 పాస్‌పోర్ట్‌లు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మిరెడ్డి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ట్రాన్స్‌పోర్టు యజమాని రషీద్ పంపడంతో అతడు సోమవారం హైదరాబాద్ చేరుకున్నాడు. 
 
పాతబస్తీలో ఉన్న స్నేహితుడు వాహిద్‌ను కలుసుకోమని, అతనిచ్చిన బ్యాగ్‌తో తిరిగి బెంగళూరు చేరుకోమని అమ్మిరెడ్డి‌కి రషీద్ చెప్పాడు. అతను చెప్పిన ప్రకారమే బ్యాగ్ తీసుకుని బస్ కోసం వేచి చూస్తుండగా పోలీసులు సందేహం మేరకు తనిఖీలు చేపట్టారు. 
 
అమ్మిరెడ్డి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో 47 పాస్‌పోర్టులు బయటపడ్డాయి. అయితే, వాటి విషయం తనకు తెలియదని, రషీద్ చెప్పిన మేరకు బ్యాగ్ తీసుకువెళ్తున్నానని అతడు తెలిపాడు. పోలీసులు అతని నుంచి 47 పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. దీనికి కారకులైన వాహీద్, రషీద్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.