బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 జులై 2014 (15:40 IST)

బెంగళూరు: ఆరేళ్ల పాపకాదు.. ఈసారి ఏడేళ్ల బాలికపై రేప్

ఆరేళ్ల పాపపై రేప్ ఘటన మరిచిపోకముందే బెంగళూరులో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మరో పాఠశాలకు చెందిన ఏడేళ్ల బాలిక పైన అత్యాచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సంఘటన జూలై 21వ తేదీన జరిగినట్లుగా తెలుస్తోంది. కూతురు పైన అత్యాచారం జరిగిన విషయం తెలుసుకున్న ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం పంపించారు. 
 
ఈ అత్యాచారం పాఠశాల అటెండెంట్ యొక్క ఇంట్లోనే జరిగిందని బాధితురాలి తల్లి ఆరోపించారు. బాధిత బాలిక రెండో తరగతి చదువుతోంది. 17 ఏళ్ల మైనర్ బాలిక రేప్ మరో సంఘటనలో పదిహేడేళ్ల మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఓ కన్‌స్ట్రక్షన్ వర్కర్‌ను అరెస్టు చేశారు. ఈ సంఘటన జూలై 2వ తేదీన నీలమంగళ ప్రాంతంలో జరిగింది.