శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (07:29 IST)

జయలలితకు గుండెపోటు.. వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు.. హెల్త్ బులిటెన్‌లో అపోలో వైద్యులు...

తమిళనాడు సీఎం జయలలితకు గుండెపోటు రావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెను సీసీయూకి మార్చారు. ఆదివారం గుండెపోటుతో ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలితకు మెరుగైన వైద్యం

తమిళనాడు సీఎం జయలలితకు గుండెపోటు రావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమెను సీసీయూకి మార్చారు. ఆదివారం గుండెపోటుతో ఆమెను ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో జయలలితకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. 68 ఏళ్ల అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత డీహైడ్రేషన్, ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. కార్డియోలజీ విభాగంలో నిపుణులైన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, తమిళనాడు గవర్నర్ సి విద్యాసాగర్ రావు అమ్మ ఆరోగ్యంపై ఆరా తీశారు. 
 
గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజా పరిస్థితిపై అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. అందులో ఆమె పరిస్థితి ఎలా ఉందో కూడా పేర్కొనకుండా, వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు అని మాత్రమే వెల్లడించారు. అపోలో వద్దకు చాలా మంది ప్రముఖులు చేరుకుంటున్నారు. తమిళనాడు సీఎస్, డీజీపీ జయ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మరోవైపు తమ అమ్మ గురించి ప్రకటన చేయాలని అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అపోలోకి ప్రవేశించేందుకు అభిమానులు ప్రయత్నిస్తున్నారు.