Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సంబంధం పెట్టుకుని మధ్యలో వద్దంటావా.. వెయ్.. పొడిచేశాడు

హైదరాబాద్, గురువారం, 6 జులై 2017 (06:35 IST)

Widgets Magazine
bhabhi relationship

రక్తం మరిగిన పులి వేట మానుతుందా.. వివాహేతర సంబంధాన్ని రుచిచూసిన మగాడు మధ్యలో వద్దు పోవోయ్ అంటే ఊరుకుంటాడా. అందులోనూ భారత మగాడు.. ఇష్టమున్నన్నాళ్లు తనతో సంబందం పెట్టుకుని అక్కర తీరిందని వదిలిస్తే ఆ మగాడికి నిజంగానే మండుకొచ్చింది. ఏం చేస్తున్నదీ తెలిని ఉన్మాదంలో వసతి గృహం ఆయానే పొడిచిపారేశాడు.
 
తమిళనాడులోని నెల్లై పట్టణంలో సాక్షాత్తూ ఇదే అంశంపై మర్డర్ జరిగిపోయింది. వివాహేతర సంబంధం ఓ మహిళను బలి తీసుకుంది. తన కోరిక తీర్చలేదని ఆగ్రహించి ప్రియుడే ఆమెను కడతేర్చాడు. నెల్లై జిల్లా ముక్కుడలైకి చెందిన చంద్రశేఖర్‌ భార్య ఆనంది (38). వీరికి సుజీధరన్, అస్సుదన్‌ ఇద్దరు కుమారులు. చంద్రశేఖర్‌ పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో ఆనంది ఇద్దరు కుమారులతో ఉంటోంది. పేటైలో ఉన్న పిల్లల వసతిగృహంలో ఆనంది వంటమనిషిగా చేరింది.  వసతి గృహంలోనే ఉన్న ఓ గదిలో తన కుమారులతో ఉంటూ వంటపని చేసేది.
 
మంగళవారం ఉదయం వసతిగృహంలో ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్లారు. ఆనంది హాస్టల్‌లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తికి, ఆనందికి ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన ఆ వ్యక్తి ఆనందిని కత్తితో నరికి చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న నెల్లై టౌన్‌ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఆనంది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఐకిరవుండు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసుల విచారణలో ఆనందితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ముక్కుడల్‌ సమీపంలో ఉన్న సింగమ్‌పాలైకి చెందిన చెల్లప్ప (50) ఈ హత్య చేసినట్టు తెలిసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారణ చేశారు.
 
ఆనంది భర్త చంద్రశేఖర్ తానూ స్నేహితులమని, చంద్రశేఖర్‌ మృతిచెందడడంతో ఆనందితో వివాహేతర సంబంధం ఏర్పడినట్టు చెల్లప్ప తెలిపాడు. కాగా,  ఆనంది వసతిగృహంలో వంటమనిషిగా చేరిన తరువాత చెల్లప్పతో మాట్లాడేది తగ్గించింది. దీంతో మంగళవారం ఉదయం హాస్టల్‌లోని పిల్లలు పాఠశాలకు వెళ్లిన తరువాత చెల్లప్ప హాస్టల్‌కి వెళ్లాడు. ఆనందితో తన కోరిక తీర్చమని కోరాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన చెల్లప్ప ఆనందిని కత్తితో నరికి హత్య చేసినట్టు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన లక్ష్మీ ప్రసన్నకు చంద్రబాబు 20 లక్షల సహాయం

అనంతపురం జిల్లా తాడిపత్రిలో భార్య, కూతుళ్ళను దారుణంగా హత్య చేసిన నిందితుడు ...

news

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన హోటల్‌ సూట్‌లో మోదీ బస

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌లో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోసం ఆ దేశం ...

news

భారత ప్రధాని మోదీకి అపూర్వ గౌరవం.. ఇజ్రాయెల్ భారతీయుల్లో హర్షాతిరేకాలు

తొలిసారిగా ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అసాధారణరీతిలో స్వాగతం ...

news

మెరుపులు, పిడుగులపై హెచ్చరికలు... వజ్రపథ్ యాప్ ఆవిష్కరించిన బాబు

అమరావతి: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ఇస్రో ఓ యాప్‌ను ...

Widgets Magazine