శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (11:36 IST)

రికార్డు స్థాయిలో పోలింగ్... పంజాబ్‌లో ఆప్‌దే ఆధికారం...

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ దశలో గోవా, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ ముగిసింది. పంజాబ్‌లో 75 శాతం, గోవాలో 83 శాతం చొప్పున పోలింగ్ నమోదైం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం తొలి దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ దశలో గోవా, పంజాబ్ రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ ముగిసింది. పంజాబ్‌లో 75 శాతం, గోవాలో 83 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. ఇందులో పంజాబ్ పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎన్డీటీవీకి చెందిన ప్రణయ్‌ రాయ్‌ విశ్లేషించారు. 
 
పంజాబ్‌లో కేజ్రీవాల్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. శనివారం పోలింగ్‌ ముగిసిన తర్వాత ప్రణయ్‌ రాయ్‌, శేఖర్‌ గుప్తా తమ అభిప్రాయాలను తెలిపారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాం. ప్రతిసారీ రాష్ట్రస్థాయి తీర్పును ప్రతిఫలించే బస్సీ పఠానాలో వందలమందిని కలిశాం. పంజాబ్‌లో 55 నుంచి 60 శాతం విజయావకాశాలు ఆప్‌కే ఉన్నాయి’’ అని ప్రణయ్‌రాయ్‌ చెప్పుకొచ్చారు. 
 
ఈ రాష్ట్రంలో నేతల తలరాతలు మార్చే అకాలీ ఓట్లు ఆప్‌వైపే మళ్లాయని, హిందూ ప్రాబల్య ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ వెనుకబడి ఉందని చెప్పారు. ఇక పంజాబ్‌లో పాత పార్టీలు కాకుండా ‘మార్పు’ కోరుకుంటున్నట్లు అక్కడి ఓటర్లు నిర్మొహమాటంగా తెలిపారని శేఖర్‌ గుప్తా చెప్పారు. ‘కుటుంబ పాలన’ పట్ల ఓటర్లలో అసంతృప్తి నెలకొందని తెలిపారు.