Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐస్‌క్రీమ్‌లు కొనేందుకు వెళ్ళిన బాలికను పెళ్లాడి.. గర్భవతిని చేశాడు..

శనివారం, 15 జులై 2017 (09:45 IST)

Widgets Magazine
Pregnant Women

బాలికలపై దారుణాలు, మోసాలు పెరిగిపోతున్నాయి. రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయిన 13ఏళ్ల బాలిక మూడువారాల గర్భంతో తిరిగి ఇంటికి చేరుకోవడం ఢిల్లీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 22 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. మే పదో తేదీన ఐస్‌క్రీములు కొనేందుకు వెళ్ళిన బాలిక ఇంటికి చేరుకోలేదని పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఓ హోటల్‌లో కుక్‌గా పనిచేస్తున్న ఇద్దు ఖాన్‌పై బాలిక తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
బాలికను పెళ్లాడిన యువకుడు.. ఆమెను గర్భవతిని చేసినట్లు ఒప్పుకున్నాడు. బాలికను తాను పెళ్ళి చేసుకున్నట్లు యువకుడు తెలిపాడు. అతడిపై బాలిక వివాహ చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచిన అనంతరం అతనిని జైలుకు తరలించారు. అతడి వివాహానికి సాక్షులుగా వ్యవహరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలిక మాత్రం ఇద్దు ఖాన్‌తోనే ఉంటానని కోర్టులో స్పష్టం చేసింది. తనను తల్లిదండ్రుల వద్దకు పంపించవద్దని అభ్యర్థించింది. ప్రస్తుతం ఆమె చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మనసు విరిగిపోయిన షర్మిల.. ఇక ఆ బంధమే వద్దనేసింది

తన ప్రాంత మహిళలను అత్యాచారాలు చేసి మరీ చంపుతున్న భారత సైన్యంపై పదహారేళ్లపాటు నిరాహార్ ...

news

జైలుపాలయ్యారా.. దండిగా డబ్బుందా.. అయితే కొండమీద కోతి కూడా దిగొస్తుంది

డబ్బున్న మారాజులు, మారాణిలకు భారత దేశంలో జైళ్లు స్వర్గధామాలని, కోరిన కోరికలు అందులో ...

news

ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడనే... డ్రగ్స్ తీసుకుంటానా.. వాపోయిన సుబ్బరాజు

ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడని తనకు డ్రగ్స్ అలవాటు చేసుకోవాల్సిన అవసరమే లేదని టాలీవుడ్ ...

news

విశాఖలో ‘కన్యాశుల్కం’ జాతీయ ఉత్సవాలు... 125 ఏళ్ల సందర్భంగా గోడపత్రిక ఆవిష్కరణ

అమరావతి : అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం ప్రదర్శన 125 ...

Widgets Magazine