శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (07:01 IST)

‘ఇండియన్ మిస్సైల్’ కలాం తొలి సంపాదన చింతగింజలతోనే..

అది తమిళనాడులోని ఓ చిన్న ఊరు.. ఆ ఊరి చుట్టూ సముద్రమే.. ఆ సముద్రం అంటే నేటి ఇండియన్ మిసైల్ అబ్దుల్ కలాంకు చాలా ఇష్టం. తీరంలో కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి తాను కూడా అలా ఎగరాలని ఆశపడేవాడు. ఇది 1940ల నాటి మాట..
 
భవిష్యత్తులో అదే కుర్రాడే భారత కీర్తిని అంతరిక్షస్థాయిలో రెపరెపలాడించాడు. ఆ కుర్రాడే.. అవుల్‌ ఫకీర్‌ జైనులబ్దీన్‌ అబ్దుల్‌ కలాం... 1931 అక్టోబర్‌ 15న జన్మించారు. జైనులబ్దీన్‌, ఆషియమ్మా.. కలాం తల్లిదండ్రులు. నిరుపేద కుటుంబం. చింతగింజలు సేకరించి అమ్మడం ద్వారా తొలి సంపాదన సంపాదించారు. అదే సంపాదనను కుటుంబానికి ఇచ్చేవాడు. 
 
ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే చురుకైన కుర్రాడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంటింటికీ పేపర్‌ వేసేవారు ఏజెంట్ ఇచ్చిన పైకంతో కావలసిన పుస్తకాలను కొనుక్కునే వారు. ఆయన తిరుచిరాపల్లిలోని సెయింట్‌ జోసెఫ్‌ కళాశాలలో 1954లో భౌతికశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించారు.