శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (17:31 IST)

ఢిల్లీ సీఎంకు మరో షాక్.. ఆప్ సభ్యత్వానికి మేధా పాట్కర్ రాజీనామా..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరో షాక్ తగిలింది. అసలే అంతర్గత పోరుతో సతమతమవుతుంటే తాజాగా సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా వేశారు. పార్టీలో అంతర్గత పోరు పట్ల ఆమె తీవ్ర ఆసంతృప్తికి గురయ్యారు. 
 
ఈ సందర్భంగా మేధా పాట్కర్ మాట్లాడుతూ.. పార్టీ నుంచి బహిష్కరించబడిన ప్రశాంత్ భూషణ్ వివిధ అవినీతి కుంభకోణాలపై చేసిన పోరాటం దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని పటిష్టపరచడంలో ఉపయోగపడిందని అన్నారు. అదేవిధంగా యోగేంద్ర యాదవ్ రైతుల వద్దకు, కింది స్థాయిలోని ప్రజల వద్దకు వెళ్లారని, వారు పార్టీని బలపరిచారని మేధా పాట్కర్ గుర్తుచేశారు.
 
వారిద్దరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు తనకు తెలియదని ఆమె అన్నారు. అయితే, తాను ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలు చేయడానికి కూడా సిద్ధంగా లేనని మేధా పాట్కర్ స్పష్టంచేశారు. అయితే పార్టీ అంతర్గత పోరాటం ముందుకు రావడం విచారకరమని మేధా పాట్కర్ అన్నారు. 
 
వేటుపడిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే సమయంలో వారిని పార్టీలో పార్టీ నుంచి తొలగించడంపై అసంతృప్తి తలెత్తితే నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి కేజ్రీవాల్ నియంతలా వ్యవహరిస్తారని నేటి సంఘటన తెలియజేస్తోందని మేధాపాట్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.