శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 23 జనవరి 2015 (12:21 IST)

అద్వానీ, రజినీకాంత్‌, అమితాబ్‌, పీవీ సింధులకు పద్మ అవార్డులు!

కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది ఇచ్చే పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో బీజేపీ అగ్రనేత ఎల్కే. అద్వానీ, సినీ సూపర్ స్టార్లు రజినీకాంత్, అమితాబ్ బచ్చన్‌తో పాటు.. తెలుగు క్రీడాకారిణి పీవీ సింధులకు పద్మ పురస్కారాలు వరించాయి. సాధారణంగా ప్రతి యేడాది భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటిస్తూ వస్తోంది. 
 
ఇందులోభాగంగా ఈ యేడాది మొత్తం 148 మందికి ఈ పురస్కారాలను కేంద్రం ఇవ్వనుంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీకి పద్మవిభూషణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు పద్మ అవార్డులు వరించాయి. అలాగే, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుకు పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. 
 
వీరితో పాటు.. ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్, ప్రకాశ్ సింగ్ బాదల్, శ్రీశ్రీ రవిశంకర్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌, బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్, ఎన్. గోపాలస్వామి, పి.వి.సింధు, సర్దార్ సింగ్, ప్రఖ్యాత దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీ, స్క్రిప్ట్ రైటర్, గీత రచయిత సలీం ఖాన్, యాడ్ ఫిలిం మేకర్ ప్రసూన్ జోషి కూడా ఈ యేడాది పద్మ పురస్కారాలకు ఎంపికైనట్టు జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకోనున్నారు.