గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Ganesh
Last Updated : ఆదివారం, 22 జూన్ 2014 (11:51 IST)

తప్పిన బియాస్ తరహా ప్రమాదం.. జార్ఖండ్ దామోదర్ నదిలో!

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24మంది తెలుగు విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్‌లో బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. అయితే తరహా సంఘటన జార్ఖండ్‌లో దామోదర్ నదిలో తప్పిపోయింది. దీంతో పదిమంది బాలలు సురక్షితంగా బయటపడ్డారు. బొకారో జిల్లాలో దామోదర్ నదిపై ఉన్న తేనూఘాట్ జలాశయం స్లూయిస్ గేట్ ఎత్తివేయడంతో దిగువన ప్రవాహ స్థాయి ఒక్కసారిగా పెరిగింది.

శుక్రవారం మధ్యాహ్నం పంచౌరా గ్రామం వద్ద నదిలో చేపలు పట్టడానికి వెళ్లిన పదిమంది బాలలు అందులో చిక్కుకుపోయారు. ఒక బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మించిన కాంక్రీట్ ప్లాట్‌ఫాంపైకి ఎక్కి ఎనిమిది గంటలపాటు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని సహాయం కోసం ఎదురుచూశారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలప్పుడు పోలీసులు వారిని రక్షించారు. బాధితులు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారని, వారి వయసు 15 నుంచి 16 ఏళ్లు ఉంటుందని బొకారో డిఫ్యూటీ కమిషనర్ ఉమాశంకర్ సింగ్ చెప్పారు.