శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 నవంబరు 2015 (12:11 IST)

మ్యాగీ నూడుల్స్ ఓవర్.. పాస్తాతో నెస్లేకు కొత్త తలనొప్పి.. సీసం పరిమాణం..?!

మ్యాగీ నూడుల్స్ దెబ్బతో మెల్ల మెల్లగా కోలుకుంటున్న నెస్లే కంపెనీకి మరో షాక్ తగిలింది. నెస్లేకి చెందిన మ్యాగీ నూడుల్స్ నిషేధం తర్వాత ల్యాబ్ పరీక్షల్లో నెగ్గి ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న నేపథ్యంలో.. నెస్లే కంపెనీకి ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబోరేటరీ షాక్ ఇచ్చింది. నెస్లే సంస్థ ఉత్పత్తి చేస్తున్న పాస్తాలో సీసం పరిమాణం నిర్ణీత ప్రమాణం కంటే అధిక స్థాయిలో ఉందని ఉత్తరప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబోరేటరీ పరీక్షల్లో తేలింది. 
 
సాధారణంగా పాస్తాలో 2.5 పీపీఎం దాకా సీసం ఉండొచ్చు. అయితే నెస్లే పాస్తాలో సీసం పరిమాణం 6 పీపీఎంగా ఉందట. యూపీ లాబోరేటరీ నివేదక ప్రకారం నెస్లే పాస్తాను ప్రమాదకర ఆహార పదార్థాల జాబితాలో చేరిపోయింది. దీంతో నెస్లేకు పాస్తాకు కొత్త చిక్కులొచ్చిపడ్డాయి. మరోమారు దీనిపై పరీక్షలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది నిజమైతే నెస్లేకి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.