శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 మే 2016 (12:45 IST)

అగస్టావెస్ట్‌ల్యాండ్ స్కామ్ : ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ త్యాగి వద్ద సీబీఐ విచారణ

అగస్టావెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో వెలుగు చూసిన ముడుపులు అందజేత అంశంపై భారత ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్.పి. త్యాగి వద్ద సీబీఐ అధికారులు సోమవారం విచారణ ప్రారంభించారు. ఇందుకోసం ఆయనకు మనీల్యాండిరింగ్ చట్టం ప్రకారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ సమన్లు జారీ చేసి విచారణకు పిలిచింది. 
 
ఆగస్టా హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారంలో మాజీ ఎయిర్‌చీఫ్ త్యాగి సోదరులకు ముడుపుల సొమ్ము ముట్టినట్లు ఈడీ ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. దీంతో త్యాగి వద్ద విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని భావించిన సీబీఐ.. ఈ నిర్ణయం తీసుకుంది. ఇటలీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న నమయంలో త్యాగీనే భారత వైమానిక దళ చీఫ్‌గా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఆసమయంలో ఈ డీల్ కుదుర్చుకునేందుకు భారత ప్రతినిధులకు అగస్టా కంపెనీ భారీగా ముడుపులు చెల్లించినట్టు ఇటలీ కోర్టు కూడా నిర్ధారించింది. దీంతో సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మరోవైపు... ఆగస్టా వ్యవహారంలో ఇప్పటికే మాజీ డిప్యూటీ ఎయిర్‌చీఫ్ జేఎస్ గుజ్రాల్‌ను కూడా సీబీఐ విచారిస్తోంది. మునుముందు కూడా ఆ విచారణ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.