Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత్‌లో బుల్లెట్ ట్రెయిన్... అహ్మదాబాద్-ముంబై... రూ. 88 వేల కోట్ల వ్యయం

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (16:22 IST)

Widgets Magazine

భారతదేశంలో త్వరలో బుల్లెట్ ట్రెయిన్ పరుగులు తీయనుంది. అహ్మదాబాద్ - ముంబై మధ్య రూ. 88 వేల కోట్ల వ్యయంతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. మొత్తం 508 కిలో మీటర్ల దూరాన్ని ఈ బుల్లెట్ ట్రెయిన్ కేవలం 2 నుంచి 3 గంటల్లోనే చేరుకుంటుంది. మామూలుగా అయితే ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ వ్యవధి 8 గంటల పాటు సాగుతుంది. ఐతే ఈ బుల్లెట్ రైలుతో ప్రయాణ కాలం సుమారు 5 గంటలకు పైగా ఆదా అవుతుంది. ఈ రైలు మార్గాన్ని భూమికి 20 మీటర్ల పైన పిల్లర్లతో నిర్మించనున్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు జపాన్ ప్రధాని శంకుస్థాపన చేసేందుకు బుధవారం భారతదేశానికి వచ్చారు.
apanese PM Shinzo Abe-Modi
 
ప్రోటోకాల్ పక్కన పెట్టి జపాన్ ప్రధానికి స్వాగతం చెప్పేందుకు ప్రధానమంత్రి మోదీ విమానాశ్రయానికి వెళ్లారు. జపాన్‌ ప్రధాని షింజో అబె భార‌త ప్ర‌ధాని మోదీతో క‌లిసి గుజ‌రాత్‌లోని అహ్మదాబాద్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు. అనంతరం జపాన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ... భార‌తదేశంతో త‌మ దేశానికి మ‌ధ్య ఉన్న‌ బంధం ప్రపం‍చంలోనే అత్యంత శక్తిమంతమైనదని అన్నారు. భారతదేశంతో వ్యాపార సంబంధాలను మరింత పెంచుకునేందుకు జపాన్ దేశం ఆసక్తిగా వున్నట్లు వెల్లడించారు. తమకున్న సాంకేతిక శక్తితో భారతదేశంలోని మానవ వనరులతో కలిపి భవిష్యత్తులో తిరుగులేని విజయాలను సాధిస్తామని వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అంతా వెంకయ్య మాయ: తెలంగాణలో 12వరకు తెలుగు తప్పనిసరి: కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణలోని అన్నిరకాల పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి తరగతి నుంచి 12వ తరగతి ...

news

డేరా బాబా ఒత్తిడి వల్లే అది చేశా.. బాబాకు లొంగని వాళ్లను కుర్చీకి కట్టేసి?

రేపిస్ట్ గుర్మీత్ సింగ్ బాబా పాపాల చిట్టా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్వ‌ప్న చౌధురి అనే ఓ ...

news

మహిళపై పదిమంది గ్యాంగ్ రేప్.. ఇద్దరు మైనర్లు కూడా.. హింసించి.. 15గంటలు?

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మైనర్లతో పాటు పదిమంది దారుణంగా ...

news

ప్రొఫెసర్ ఐలయ్య ఓ సైకో - ఆర్యవైశ్యులు.. చంద్రబాబు సీరియస్

ఆర్యవైశ్యులపై రచయిత కంచె ఐలయ్య రాసిన వాక్యాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...

Widgets Magazine