మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 27 మే 2015 (15:21 IST)

'అమ్మ' కోసం ఐదు వేల గుండ్లు... చేతుల్లో నిప్పు కుండలతో మొక్కులు...

తమిళనాడు రాష్ట్ర ప్రజలు ముద్దుగా పిలుచుకునే 'అమ్మ' జయలలిత మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అధ్యక్షతన, కరూర్ జిల్లాలోని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు 5,000 మంది గుండ్లు గీయించుకుని, నిప్పు కుండలు చేతపట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత, అక్రమాస్తుల కేసు నుంచి విడుదల కావాలని కోరుకుంటూ, కరూర్ జిల్లా అన్నాడీఎంకే పార్టీ తరపున, జిల్లాలో ఉన్న పలు ఆలయాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అధ్యక్షతన పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు చేశారు. 
 
ఆ విధంగానే, అక్రమాస్తుల కేసులో నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత విడుదల కావడంతోపాటు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదోసారి పదవి చేపట్టారు. ఈ స్థితిలో కరూర్ మారియమ్మకు మొక్కులు తీర్చుకునే రీతిలో కరూర్ జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి, రవాణా శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అధ్యక్షతన గుండ్లు గీయించుకుని, చేతుల్లో నిప్పు కుండలు పెట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు. అన్నాడీఎంకే పార్టీకి చెందిన 5000 మందికిపైగా నిర్వాహకులు, కార్యకర్తలు కలుసుకుని మొక్కులు తీర్చుకున్నారు.