Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీఎం పళనిస్వామి బల పరీక్షలో నెగ్గడం డౌటేనా? పన్నీర్ ఏం చేస్తారు? ఇంటికి రెసార్ట్ ఎమ్మెల్యేలు

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (14:50 IST)

Widgets Magazine

తమిళ రాజకీయాలకు తెరపడేలా కనిపించట్లేదు. సీఎం పళని స్వామి బలపరీక్షలో నెగ్గుతారా? లేదా అనే దానిపై ప్రస్తుతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుటా ఎగురవేసి తన మద్దతు దారులతో దూసుకుపోతున్నారు. సోషల్ మీడియాలో పన్నీరుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా ఎమ్మెల్యేలను కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చిన్నమ్మకు వ్యతిరేకంగా అమ్మ పార్టీకి విధేయుడిగా తన ధర్మయుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో 12రోజుల హైడ్రామాకు తెర దించుతూ ఎడప్పాటి పళనిస్వామి గురువారం తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ శనివారం బలం నిరూపించుకోవాల్సి ఉంది. కానీ అది సాధ్యమవుతుందా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఇన్నాళ్లు రిసార్ట్‌లో బందీలుగా ఉన్న ఎమ్మెల్యేలు ఇంటి ముఖం పడుతున్నారు. ఇదే అదనుగా తీసుకున్న పన్నీర్ సెల్వం వారిని తనవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వారి నియోజకవర్గంలోని ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయ్యేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా పన్నీర్ వర్గం కార్యాచరణలోకి దిగింది. దాంతో ప్రజాభిప్రాయం పేరిట కొంత మంది శాసన సభ్యులు తమ వైపుకు వచ్చేలా ఓటింగ్ సమయంలో పళనికి ఓటేయకుండా నిరోధించేలా ఓపీఎస్ వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
 
అయితే ఇన్నాళ్లు తనవైపు తిప్పుకోలేని పన్నీర్ సెల్వం కేవలం బలపరీక్షకు కొన్ని గంటలే ఉన్న తరుణంలో రెసార్ట్ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కుంటారా? లేదా అనేది కూడా చర్చనీయాంశమైంది. అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటేనే బలపరీక్షలో పన్నీరుకు మద్దతు లభిస్తుందని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. శశివర్గంలో ఉన్నామని ఆలోచించకుండా.. ప్రజల వైపు ఉండాలనే విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తిస్తే తప్పకుండా పన్నీరుకే మద్దతు లభించే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. 
 
ఇకపోతే.. పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుతూ అన్నాడీఎంకేకు చెందిన ఓ కార్యకర్త సెల్ టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దిండుక్కల్‌ జిల్లాకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్త సుందరమూర్తి పట్టివీరన్‌పట్టి బస్టాండ్ సమీపంలో ఓ సెల్‌ఫోన్‌ టవర్‌ ఎక్కి పన్నీర్‌కు మద్దతుగా నినాదాలు చేశాడు. పన్నీర్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగాలని డిమాండ్‌ చేశాడు. అందుకు భిన్నంగా జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతను కిందకు దిగేలా చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.
 
ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను కర్ణాటక నుంచి తమిళనాడులోని జైలుకు తరలించాలని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన గురువారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు. భద్రత కారణాల దృష్ట్యా శశికళను తమిళనాడు కారాగారానికి మార్చాలన్నారు. దీనికి సంబంధించి శశికళ తరఫున న్యాయవాదులు రెండు రోజుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని సూచన కూడా చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గుత్తా జ్వాల రాజకీయాల్లోకి వస్తుందట... ఏం చేయడానికో తెలుసా?

ప్రజల్లో పాపులారిటీ వచ్చేస్తే చాలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేయవచ్చు. ఐతే అలా వచ్చి ...

news

ఎమ్మెల్యేల వాహనాలపై ఉమ్మేసి.. బూతులు తిట్టిన ప్రజలు.. రెసార్ట్‌లో తిరుగుబాటు.. పన్నీర్‌కు సపోర్ట్?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ క్యాంపు నుంచి సీఎంగా ఎంపికైన పళని స్వామికి ...

news

బలపరీక్ష.. రెసార్ట్ నుంచి ఎమ్మెల్యేలను వదిలిపెట్టండి... పన్నీర్ క్యాంప్ సవాల్... ఆర్కే నగర్‌ నుంచి దీప పోటీ?

తమిళనాడు సీఎంగా పళని స్వామి ప్రమాణ స్వీకారం చేయడంతో సమసిపోయిందనుకున్న తమిళ రాజకీయ ...

news

హైదరాబాదీ యువతి సునీత హత్య... ప్రేమ కాటేనా...? ఐదుగురు ఆత్మహత్య, ఒకరు మర్డర్...

తన అన్న కుమార్తెలను కన్న కూతుళ్లలా సాకుతున్న హైదరాబాదీ యువతి సునీతను పట్టపగలే హత్య చేసి ...

Widgets Magazine