భార్యకు అధికారం.. భర్తకు అనారోగ్యం.. ఎవరు.. ఏమిటి... ఎక్కడ?

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (09:26 IST)

sasikala - natarajan

భార్యకు అధికారం.. భర్తకు అనారోగ్యం.. ఎవరు.. ఏమిటనే కదా మీ సందేహం. ఆ భార్య ఎవరో కాదు.. శశికళ. భర్త.. నటరాజన్. శశికళకు ముఖ్యమంత్రి పీఠం రాగానే, ఆమె భర్త నటరాజన్‌ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
తమిళనాడు అసెంబ్లీ శాసనసభాపక్ష నేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. దీంతో ఆమె తమిళనాట చక్రం తిప్పేశానంటూ విక్టరీ సింబల్ చూపిస్తుంచారు. ఇంతలోనే ఆమెకు ఓ షాకింగ్ న్యూస్. భర్త నటరాజన్‌కు అనారోగ్యం అంటూ మీడియాలో కనబడ్డ బ్రేకింగ్ న్యూస్.. శశికళ ప్రమోషన్ సంబరంపై నీళ్లు జల్లేసింది. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో నటరాజన్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. 
 
ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఇటు.. సీఎంగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం చూసుకుంటున్న శశికళ ఆస్పత్రి పడక మీదున్న భర్తను పరామర్శించే తీరిక కూడా లేకపోయింది. 7 లేదా 9 తేదీల్లో శశికళ ప్రమాణ స్వీకారం జరగనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

త్వరలోనే తమిళనాడులో డీఎంకే పాలన.. సీఎంగా స్టాలిన్ : డీఎంకే ఎమ్మెల్యే

తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఓ ...

news

జయ చనిపోయినపుడే సీఎం పగ్గాలు చేపట్టాలన్నారు.. పన్నీర్ నమ్మినబంటు : శశికళ

ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆస్పత్రిలో చనిపోయిన మరుక్షణమే తనను పార్టీ పగ్గాలతో పాటు ...

news

ఆ బంగ్లాకు రాజభోగం.. అందుకోసమే శశికళ ఆ భవనంలో ఉంటున్నారా?

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ ఒకటి రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదీ ...

news

సీఎంగా శశికళనా? మిలిటరీ తరహా కుట్ర... ఇంతకన్నా దురదృష్టం మరోటి ఉండదు : దీప

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ బాధ్యతలు చేపట్టనుండటం అంటే ప్రజలకు ఇంతకన్నా ...