Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళకు ఓపీఎస్ స్ట్రోక్ : క్యాంపు పాలిటిక్స్... 130 మంది ఎమ్మెల్యేల కిడ్నాప్... ఫోన్లు స్వాధీనం

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (17:17 IST)

Widgets Magazine
aiadmk mla's

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం రూపంలో తేరుకోలేని షాక్ తగిలింది. దీంతో సొంత పార్టీకి చెందిన 135 మంది ఎమ్మెల్యేల్లో 130 మంది ఎమ్మెల్యేలను ఆమె కిడ్నాప్ (క్యాంపు రాజకీయాల పేరిట రహస్య ప్రాంతానికి తరలించడం) చేశారు. 
 
బుధవారం మధ్యాహ్నం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించిన శశికళ.. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేలందరినీ రహస్య ప్రాంతానికి తరలించాలని ఆదేశించారు. దీంతో 130 మంది ఎమ్మెల్యేలను రెండు బస్సుల్లో చెన్నై ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓ నక్షత్ర హోటల్‌కు తరలించారు. 
 
మరోవైపు.. అన్నాడీఎంకేకు చెందిన ఎంపీలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. ఇందుకోసం వారంతా అత్యవసరంగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేయనున్నారు. అదేసమయంలో సంపూర్ణ మజార్టీ ఉన్న శశికళను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని వారు కోరనున్నారు. 
 
ఇదిలావుండగా, పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో అప్రమత్తమైన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వేగంగా పావులు కదుపుతున్నారు. తనకు మద్దతు తెలుపుతున్నట్టు వారి నుంచి సంతకాలు సేకరించారు. ఆ తర్వాత వారిని రహస్య ప్రాంతానికి తరలించారు. పన్నీర్ సెల్వం, డీఎంకే, బీజేపీ వంటి పార్టీల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు నెలకొనకుండా ఆమె అనుచరులు ఎమ్మెల్యేల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 
 
బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, వారి నుంచి ఎలాంటి సమాచారం ఇతరులకు చేరకుండా చర్యలు చేపట్టారు. దీంతో తమిళనాట కలకలం రేగుతోంది. అధికారం కోసం శశికళ వేస్తున్న ఎత్తులు, కదుపుతున్న పావులను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తిరుగుబాటు ఎగురవేసిన ఓ.పన్నీర్ సెల్వంకు రాష్ట్ర యువత, ప్రజలు అండగా నిలుస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sasikala Transport Bus Star Hotel O Panneerselvam Aiadmk Mla’s Aiadmk Live Updates

Loading comments ...

తెలుగు వార్తలు

news

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీ ఎవరికి... శశికళ - పన్నీర్ సెల్వం మధ్యలో స్టాలిన్!

తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై ఇపుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. "ఓ కోతి.. రెండు పిల్లలు" ...

news

చెన్నైకు గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ఇప్పట్లో రారట...

తమిళనాడు రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు ముంబైలోనే ఉన్నారు. ఈయనకు ...

news

దీపతో జతకట్టేందుకు పన్నీరు సెల్వం రెడీ - డీఎంకేకి హ్యాండే..!

ప్రస్తుతం దేశ ప్రజలందరూ తమిళనాడు రాజకీయాలవైపే చూస్తున్నారు. ఏ క్షణం ఏ జరుగుతుందన్న ...

news

సెల్ఫీ కోసం కుక్క చెవులను కోసేశారు... ఇంత దారుణమా?

సెల్ఫీ మోజులో పడిన యువత మూగజీవులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. తాజాగా టర్కీలో ఇద్దరు ...

Widgets Magazine