శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (10:35 IST)

ముఖ్యమంత్రి కుర్చీ మినహా.... పన్నీర్ సెల్వం డిమాండ్లన్నింటికీ పళని ఓకే...!

అన్నాడీఎంకే వైరి వర్గాల విలీనానికి డీల్ కుదిరింది. ముఖ్యమంత్రి కుర్చీ మినహా మిగిలిన అన్ని డిమాండ్లకు ముఖ్యమంత్రి పళనిస్వామి సమ్మతించినట్టు సమాచారం. దీంతో మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వ

అన్నాడీఎంకే వైరి వర్గాల విలీనానికి డీల్ కుదిరింది. ముఖ్యమంత్రి కుర్చీ మినహా మిగిలిన అన్ని డిమాండ్లకు ముఖ్యమంత్రి పళనిస్వామి సమ్మతించినట్టు సమాచారం. దీంతో మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంతో పాటు ఆయన వర్గం మెత్తపడి పార్టీలో చేరేందుకు సమ్మతించినట్టు జాతీయ మీడియా వర్గాల కథనం. గత కొన్ని రోజులుగా అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే.
 
ఈ నేపథ్యంలో దినకరన్ అరెస్టుతో రెండు వర్గాల మధ్య అవగాహన కుదిరినట్టు తమిళ మీడియా పేర్కొంటోంది. రెండాకుల గుర్తు కోసం జాతీయ ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు దినకరన్ అరెస్టు వరకు ఆగి, ఆ తర్వాత పార్టీని విలీనం చేయాలని పన్నీరు సెల్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
విలీనం అనంతరం ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగనుండగా, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. అలాగే ముఖ్యమంత్రి పదవి మినహా పన్నీరు సెల్వం డిమాండ్లను కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.