Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గవర్నర్‌తో పన్నీర్ భేటీ ఓవర్.. ధర్మమే గెలుస్తుందన్న ఓపీఎస్.. శశిపై స్టాలిన్ ఫైర్

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (17:52 IST)

Widgets Magazine

తమిళనాట రాజకీయాలు హీటెక్కాయి. శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం వార్ జరుగుతోంది. తమ బలాన్ని నిరూపించుకునేందుకు శశికళ-పన్నీర్ సెల్వం సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్‌రావుతో సమావేశం అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌తో తన సమావేశం దాదాపు ఏడు నిమిషాలపాటు జరిగిందని చెప్పారు. 
 
ధర్మమే విజయం సాధిస్తుందని పన్నీర్ సెల్వం ఉద్ఘాటించారు. న్యాయం జరుగుతుందని గవర్నర్ తనకు హామీ ఇచ్చారన్నారు. తనకు 'అమ్మ' జయలలిత ఆశీర్వాదాలు ఉన్నాయని తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన ఆత్మస్థైర్యంతో కనిపించారు. గవర్నర్‌ను కలిసినవారిలో అన్నా డీఎంకే సీనియర్ నేత మైత్రేయన్ కూడా ఉన్నారు.
 
ఇదిలా ఉంటే.. తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుగుబాటు వెనక డీఎంకే ఉందని ఆరోపణలు చేస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే పన్నీరు సెల్వం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని శశికళకు స్టాలిన్ తన ప్రకటనలో సవాల్ విసిరారు.
 
ప్రతిపక్ష నేతతో కలిసి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నవ్వారని, వారిద్దరికీ సంబంధాలున్నాయని శశికళ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అత్యంత వేగంగా సీఎం కాలేకపోయాననే దిగులుతో కృంగిపోయిన శశికళ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎద్దేవా చేశారు. గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన పన్నీరు సెల్వంను పోయెస్ గార్డెన్ పిలిపించి, రెండు గంటలపాటు బెదిరించి రాజీనామా చేయించిన శశికళ.. అన్నాడీఎంకే కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. శశికళకు నిజంగా దమ్ముంటే పన్నీరు సెల్వం చేసిన విమర్శలకు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళకు పన్నీర్ సెల్వం ఎలా చెక్ పెడుతున్నారు? పక్కా పొలిటికల్ లీడర్ ఎలా మారాడు?

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఓ. పన్నీర్ ...

news

అబ్బెబ్బే... మాకెలాంటి సంబంధం లేదు : టీఎన్ పాలిట్రిక్స్‌పై రాజ్‌నాథ్

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని ...

news

సీఎం పీఠంపై శశి ఆశకు కారణం అదే?: జయలలితను ఎంజీఆర్, రాజీవ్ ఆనాడే హెచ్చరించారా?

1987వ సంవత్సరం ఓ రోజున ఎంజీఆర్.. జయలలితను పిలపించారు. "నీవు ఏమైనా చెయ్.. మద్దతిస్తా... ...

news

శశికళకు పన్నీర్ షాక్ : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఇ.మధుసూదనన్

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ...

Widgets Magazine