శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:41 IST)

పన్నీర్ మాత్రం సీఎం కాకూడదు... మీలో ఎవరైనా ఉండండి.. ఎమ్మెల్యేలతో శశికళ

ఇంతకాలం నమ్మినబంటుగా ఉండి తిరుగుబాటుతో వెన్నుపోటు పొడిచిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం మాత్రం సీఎం కుర్చీలో కూర్చోరాదనీ, మీలో ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టండంటూ గోల్డెన్ బే రిసార్ట్స్‌లో తనత

ఇంతకాలం నమ్మినబంటుగా ఉండి తిరుగుబాటుతో వెన్నుపోటు పొడిచిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం మాత్రం సీఎం కుర్చీలో కూర్చోరాదనీ, మీలో ఎవరైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టండంటూ గోల్డెన్ బే రిసార్ట్స్‌లో తనతో ఉన్న శాసనసభ్యులతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ స్పష్టంచేశారు. 
 
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఆమె అనుకున్నట్టుగానే చేశారు. ఫలితంగా తమిళనాడు రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. పన్నీర్ సెల్వంపై పంతంతో ఆమె ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఆమె వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. 
 
దీంతో లైన్ క్లియర్ అయిందనుకున్న పన్నీర్ వర్గానికి ఊహించని సమస్య ఎదురైంది. గవర్నర్ పళనిస్వామి లేఖపై తీసుకునే నిర్ణయంతో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే పళనిస్వామి సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 
 
అయితే గవర్నర్ బల పరీక్షకు అవకాశం ఇస్తే తమిళనాడు అసెంబ్లీలో బలాబలాలను ఆధారంగా చేసుకుని తదుపరి సీఎం ఎవరనేది తేలనుంది. తాను సీఎం కాకపోయినా ఫర్వాలేదు కానీ, పన్నీర్ సెల్వం కాకూడదనే ఉద్దేశంతో శశికళ ఇదంతా చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. 
 
అంతేకాకుండా, పన్నీర్ సెల్వంతో పాటు.. మొత్తం 19 మంది తిరుగుబాటు నేతలను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి శశికళ తప్పిస్తూ చర్యలు చర్యలు తీసుకున్నారు.