శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (17:55 IST)

పళనిస్వామి పన్నీరుకు బద్ధ వ్యతిరేకి... డీజీపీ సెల్వంను బయట కాలు పెట్టొద్దన్నారు..

గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్ళి శశికళ ఉంచిన ఎమ్మెల్యేలను కలవాలని నిర్ణయించిన పన్నీర్‌ సెల్వంను డీజీపీ టీకే రాజేంద్రన్ అడ్డుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లడం మంచిది కాదని పన్నీర్ సెల్వంను డ

గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్ళి శశికళ ఉంచిన ఎమ్మెల్యేలను కలవాలని నిర్ణయించిన పన్నీర్‌ సెల్వంను డీజీపీ టీకే రాజేంద్రన్ అడ్డుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లడం మంచిది కాదని పన్నీర్ సెల్వంను డీజీపీ హెచ్చరించారు. ప్రస్తుతం బయట ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో బయట కాలు పెట్టడం అంతమంచిది కాదని సూచించారు. దీంతో పన్నీర్ వెనక్కి తగ్గినట్టు సమాచారం. 
 
ఇదిలా ఉంటే.. శశికళను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించి శిక్షను ఖరారు చేసిన తర్వాత పళనిస్వామి పేరు తెర మీదికి వచ్చింది. పళని స్వామిని తెర మీదికి తేవడంలో శశికళ పన్నీర్ సెల్వం ఆశలపై నీళ్లు చల్లినట్లు భావిస్తున్నారు. తనకు అత్యంత విధేయుడైన పళని స్వామి శాసనసభా పక్ష, నేతగా ఎన్నికయ్యే విధంగా శశికళ జాగ్రత్తలు తీుకున్నారు. తీర్పు రావడమే తరువాయి ఏ మాత్రం జాప్యం చేయకుండా శశికళ చక్రం తిప్పారు. 
 
ప్లాన్ బీని అమలు చేయడంలో అత్యంత వేగంగా కదిలారు. తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ పళని స్వామి తనకు మద్దతు ఇస్తున్న శాసనసభ్యుల సంతకాలతో గవర్నర్‌కు ఫాక్స్ పంపించారు. ఆ తర్వాత అపాయింట్‌మెంట్ కోరి గవర్నరును కలిశారు. పళనిస్వామి పన్నీరు సెల్వంకు పార్టీలో బద్ధ వ్యతిరేకి. అదే పన్నీరు సెల్వంకు చెక్ పెట్టడానికి శశికళకు ఉపకరించిందని రాజకీయ పండితులు అంటున్నారు.