గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (15:59 IST)

మనిషిని పోలిన వింత జీవి... సోషల్ మీడియాలో హల్‌చల్..

మనిషిని పోలిన వింత జీవి ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటి వరకు ఎన్నెన్నో వింత జీవులను మనం చూసి ఉంటాం. అయితే మనిషిని పోలిన జీవి కోతి తప్ప మరొకటి కనిపించదు. తాజాగా మనిషి ఆకారంలో ఉన్న ఈ వింత జీవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హడావుడి చేస్తోంది. వికృతమైన మొహం, కాళ్లు, చేతులు ఉన్న ఈ జీవి రాజస్థాన్‌లోని జోథ్‌‌పూర్‌‌లో ఓ బోరు బావి నుంచి బయటపడిందట. 
 
ఈ వింత జీవి చూడటానికి చిన్న పిల్లాడిలా కనిపిస్తుండడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. దీన్ని చూసిన కొందరు ఎలియన్ అని అంటున్నారు. మరికొందరు ఈ వింత జీవిని ఫోటోలు తీసుకుని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. అయితే ఇది ఏంటన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఆ జీవి ఎక్కడిది, అక్కడికి ఎలా వచ్చింది, అసలు అదేంటి అనే విషయంగా ఆరాతీస్తున్నారు.