గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (16:01 IST)

ఆరుషి కేసు: తల్లిదండ్రులు నిర్ధోషులు.. అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

దేశ వ్యాప్తంగా ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు విముక్తి లభించింది. సీబీఐ సరైన ఆధారాలు చూపించకపోవడంతో తల్వార్ దంపతులను తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనంతరం వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ కోర్టు

దేశ వ్యాప్తంగా ఆరుషి హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు విముక్తి లభించింది. సీబీఐ సరైన ఆధారాలు చూపించకపోవడంతో తల్వార్ దంపతులను తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనంతరం వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. ఆరుషిని తల్లిదండ్రులే హత్య చేసి వుంటారనే అనుమానంతో సీబీఐ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. గత తొమ్మిదేళ్ల పాటు దాస్నా జైలులో ఉన్న తల్వార్ దంపతులు కోర్టు తీర్పుతో త్వరలో విడుదల కానున్నారు. 
 
2008 మే 16న ఆరుషి తన గదిలో హత్యకు గురైంది. ఈ హత్యను ఎవరి చేసివుంటారనే కోణంలో సీబీఐ విచారణ జరిపింది. తొలుత వారి పనిమనిషి హేమరాజ్ హత్య చేసివుంటాడని పోలీసులు అనుమానించారు. ఆపై ఆరుషిని కన్నతల్లిదండ్రులే హత్యచేసివుంటారని పోలీసులు అనుమానించి అరెస్ట్ చేశారు. 
 
అయితే జైలులో తొమ్మిదేళ్లు వారిని బంధించినా ఆరుషి హత్య కేసులో తల్వార్ దంపతులే హత్య చేశారనేందుకు ఎలాంటి ఆధారం లభించలేదు. దీంతో అలహాబాద్ కోర్టు సరైన ఆధారాలు లభించకపోవడంతో వారిని విడుదల చేయాల్సిందిగా సంచలన తీర్పునిచ్చింది. ఫలితం ఆరుషి త‌ల్లిదండ్రులు నూపుర్‌ త‌ల్వార్‌, రాజేశ్ త‌ల్వార్‌ల‌ను నిర్దోషులుగా జైలు నుంచి విడుదల కానున్నారు.