బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (11:22 IST)

పొరపాట్లను సరిదిద్దడానికే సవరణ: వెంకయ్య నాయుడు

ఎంపీలు, ఎమ్మెల్సీల విషయంలో జరిగిన పొరపాటు సరిదిద్ది, ఇకపై అటువంటి జరగకుండా అడ్డుకునేందకే ఆంధ్ర ప్రదేశ్  పునర్వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు తెస్తామంటున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 
 
ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. చట్ట సవరణను కొందరు మొండిగా వ్యతిరేకించడమే కాకుండా, దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ విషయంలో వస్తున్న విమర్శలపై వెంకయ్య ఈ మేరకు స్పందించారు. 
 
ఈ విషయమై ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ... రాజ్యసభలో ఏపీ ఎంపీలు తెలంగాణకు, తెలంగాణ ఎంపీలు ఏపీకి కేటాయింపు జరిగిందన్నారు. ఎమ్మెల్సీల సంఖ్య విషయంలో కూడా అలాగే జరిగిందంటూ.. ప్రభుత్వం వీటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. 
 
‘ఏపీ ఎంపీలు తెలంగాణలో, తెలంగాణ ఎంపీలు ఏపీలోనే ఉండాలని, శాసనమండలిలో ఏపీ, తెలంగాణ ప్రజలకు సముచిత ప్రాతినిధ్యం దక్కకూడదని సవరణను వ్యతిరేకించేవారు భావిస్తే తామేమి చేయలేమని..’ ఆయన పేర్కొన్నారు.