Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పకోడీల వ్యాపారానికి లోను ఇప్పించండి.. స్మృతి ఇరానీకి బీజేపీ కార్యకర్త లేఖ

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (18:30 IST)

Widgets Magazine
smriti irani

పకోడీలు అమ్ముకోవడం కూడా ఓ ఉపాధేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ముహుర్తాన వ్యాఖ్యానించారో గానీ.. ఈ వ్యాఖ్యలు బీజేపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా, బీజేపీ కార్యకర్తలపై ఈ వ్యాఖ్యలపై తమదైనశైలిలో వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీకి చెందిన ఓ కార్యకర్త కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఓ రాశారు. పకోడీలు తయారు చేసి, అమ్ముకునే వ్యాపారం స్టార్ట్ చేసేందుకు బ్యాంకు రుణం ఇప్పంచాలని ఆ లేఖలో కోరారు. ఇది బీజేపీ నేతలను మరింతగా ఇరుకున పెట్టేసింది. ఈ లేఖలోని సారాంశాన్ని పరిశీలిస్తే, 
 
'గౌరవనీయులైన కేంద్రమంత్రివర్యులు స్మృతి ఇరానీ గారికి... బీజేపీకి ఉన్న కార్యర్తల్లో తాను ఒకడిని. అమేథీ నియోజకవర్గం సోషల్ మీడియా ఇంఛార్జ్‌గా పని చేస్తున్నాను. అయితే గత కొన్ని రోజులుగా జాబ్ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. అయినాసరే ఉపాధి లభించలేదు. ఏం చేద్దామా అనుకుంటున్న తరుణంలో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. పకోడీలు అమ్ముకోవడం గురించి చెప్పారు. వెంటనే నాకు ఓ ఆలోచన తట్టి ఉద్యోగ అన్వేషణ ప్రయాత్నాలు మానేశాను.
 
చిన్నపాటి వ్యాపారం ప్రారంభించడానికి ముద్రా లోన్ కోసం బ్యాంకులు చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. ఎవరూ నాకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. వాళ్ల మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. లోన్ అడిగితే ఏవేవో చెబుతున్నారు. వాళ్ల మాటలు చూస్తుంటే.. లోన్ మంజూరుకావడం ఇప్పట్లో సాధ్యం కాదనిపిస్తోంది. 
 
మరోవైపు ముద్రా లోన్ల ద్వారా 10 కోట్ల మందికి ప్రయోజనం కలిగిందని.. సాక్షాత్తు ప్రధాని మోడీ చెబుతున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రివర్గం కూడా ఇదే చెబుతూ వస్తోంది. ప్రధాని స్థాయి వ్యక్తి అబద్ధాలు చెబుతారు అనుకోవడం లేదు. ఆయనపై నాకు నమ్మకం, గౌరవం ఉంది. అయినా బ్యాంకుల వైఖరి మాత్రం.. ప్రధాని ఆశయాలకు విరుద్ధంగా ఉందని మాత్రం చెప్పగలను. ఈ విషయంలో నాకు మీరే ఏవిధంగానైనా సాయమందించగలరని నా నమ్మకం. ప్రధాని మోడీతో మాట్లాడి.. పకోడీల వ్యాపారం ప్రారంభించడానికి నాకు లోన్ ఇప్పించండి అంటూ అమేథీ నియోజకవర్గ బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ అశ్విన్ మిత్రా అనే రాసిన లేఖలో పేర్కొన్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీకి ఆ భయం వుండొచ్చు.. ముఖేష్ అంబానీలాంటి వ్యక్తే?: జేసీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చూసి బీజేపీకి భయం వుండొచ్చునని టీడీపీ ...

news

టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనికి శిక్ష పడింది... రెండేళ్ళ జైలు

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షిపై చేయి చేసుకుని ఆ తర్వాత అధికార బలంతో ఆ ...

news

చంద్రబాబు అంటే మోడీకి ఈర్ష్య - ద్వేషం ఉన్నట్టుంది : జేసీ దివాకర్

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు ...

news

తప్పిపోయిన ప్రేయసి కోసం.. 600 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

ప్రేమించిన భార్య కోసం 42 ఏళ్ల జార్ఖండ్ వ్యక్తి మనోహర్ నాయక్ సైకిల్ యాత్ర చేశాడు. ...

Widgets Magazine