గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (17:35 IST)

నైట్ క్లబ్ అని తెలీదు.. అందుకే ప్రారంభించా : బీజేపీ ఎంపీ

భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ సాక్షి మహారాజ్ ఓ నైట్ క్లబ్‌ను ప్రారంభించారు. దీనిపై సొంత పార్టీలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. నిజానికి కథువా, ఉన్నావోలో బాలికలపై అత్యాచారాలు జ

భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ సాక్షి మహారాజ్ ఓ నైట్ క్లబ్‌ను ప్రారంభించారు. దీనిపై సొంత పార్టీలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. నిజానికి కథువా, ఉన్నావోలో బాలికలపై అత్యాచారాలు జరిగాయి. ఈ అత్యాచార ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
 
అయితే, అదే నియోజకవర్గ పార్లమెంట్ ఎంపీ, బీజేపీ నేత సాక్షీ మహరాజ్ లక్నోలో ఓ నైట్ క్లబ్‌ను ప్రారంభించడం గమనార్హం. దీనిపై ఆయన స్పందిస్తూ, ఆదివారం తన నియోజకవర్గానికి చెందిన రజ్జన్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది తనను అలీగంజ్ ప్రాంతంలోకి తీసుకెళ్లారని, అక్కడ తనకు సుమిత్ సింగ్, అమిత్ గుప్తాలను రెస్టారెంట్ యజమానులుగా పరిచయం చేశారన్నారు. ఆపై తనను రెస్టారెంట్ ప్రారంభించాలని కోరితే అంగీకరించానని అన్నారు. మీడియాలో రిపోర్టులను చూసిన తర్వాతనే అది రెస్టారెంట్ కాదు, నైట్ క్లబ్ అని తెలిసిందని అన్నారు.
 
నిజానికి అది నైట్ క్లబ్ అని తెలీదనీ, రెస్టారెంట్ అనుకుని ప్రారంభించినట్టు తెలిపారు. ఈ విషయంలో తాను పొరపాటు పడినట్టు చెప్పారు. అది ఓ రెస్టారెంట్ అని తాను భావించానని, నైట్ క్లబ్ అని తనకు తెలీనే తెలీదని, నైట్ క్లబ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను డిమాండ్ చేశారు.