శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2014 (16:07 IST)

మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను పక్కనబెట్టాలంటే.. ఓపిక పట్టండి: అమిత్ షా

పదహేనేళ్లుగా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేయాలంటే బీజేపీ-శివసేన ఐక్యమత్యంగా నిలవాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ-శివసేనకు అనుకూలంగా ఉన్నాయని ఆయన గుర్తుచేశారు.
 
భారతీయ జనతా పార్టీ - శివ సేన రెండు పార్టీలు కూడా ముందుకు వచ్చి సీట్ల సర్దుబాటుపై స్పష్టతకు రావాలని అమిత్ షా పిలుపు నిచ్చారు. సీఎం పీఠంపై కన్నేసిన రెండు పార్టీలూ పొత్తుల్లో అధిక వాటా పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. చెరి సగం సీట్లలో పోటీ చేయాలని బీజేపీ పట్టుబడుతుండగా, శివసేన దీనికి ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మహారాష్ట్రలో నిలదొక్కుకోవాలంటే బీజేపీ- శివసేనల మధ్య ఐక్యమత్యం ఉండాలన్నారు. 
 
కాగా మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లుండగా చెరి 135 సీట్లలో పోటీ చేసి మిగిలిన 18 సీట్లు ఇతర మిత్రపక్షాలకు వదలి పెడదామంటూ బీజేపీ చెబుతోంది. అయితే, 155 సీట్లకు తగ్గేది లేదని శివసేన అంటోంది.
 
2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 160 సీట్లకు పోటీ చేసి 44 గెల్చుకోగా, బీజేపీ కేవలం 119 సీట్లకు పోటీ చేసినా, 46 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ 23 సీట్లు గెల్చుకోగా, శివసేన 18 సీట్లు మాత్రమే గెల్చుకుంది.