శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (00:53 IST)

'అమ్మ' పార్థివదేహం తరలింపు... పోలీసు వలయంలో పోయస్ గార్డెన్

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఇకలేరు. గత 75 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె.. సోమవారం రాత్రి 11.30 గంటల సమీపంలో కన్నుమూసినట్టు ఆస్పత్రి యాజమాన్యం అధికారికంగా

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఇకలేరు. గత 75 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆమె.. సోమవారం రాత్రి 11.30 గంటల సమీపంలో కన్నుమూసినట్టు ఆస్పత్రి యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. 
 
దీంతో లలితంగా ధిక్కరించిన అమ్మ గొంతు శాశ్వతంగా మూగబోయింది. అమ్మ మరణవార్త విన్న తమిళ జనాలు కన్నీటి పర్యాంతమవుతున్నారు. ఆమె పార్థివదేహాన్ని జయలలిత అధికారిక నివాసమైన పోయెస్‌గార్డెన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అపోలో ఆస్పత్రిలో అంబులెన్స్‌ సహా సీఎం కాన్వాయ్‌ సిద్ధం చేశారు. అపోలో ఆస్పత్రి నుంచి పోయెస్‌ గార్డెన్‌ వరకు పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. 
 
అడుగుకో పోలీసు చొప్పున 3 కి.మీ. మేర పటిష్ట భద్రత చేపట్టారు. అంతేకాకుండా, పోయస్ గార్డెన్‌ను భద్రతా బలగాలు తమ అదుపులోకి తీసుకున్నాయి. చెన్నై నగర వ్యాప్తంగా భద్రతా బలగాలను భారీ స్థాయిలో మొహరించారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు.