గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (01:15 IST)

అమ్మ గొంతు మూగబోయింది.. రాజకీయ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్య.. అమ్మ అనుగ్రహిస్తే.. ఆగ్రహిస్తే?

తమిళనాడు సీఎం జయలలిత సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుకు గురైన అమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అమ్మ గొంతు మూగబోయింది. అమ్మ ఇకలేరన్న వార్త విన్న తమిళ జనాలు కంటనీరు పెట్టుకున్నారు. అపో

తమిళనాడు సీఎం జయలలిత సోమవారం అర్థరాత్రి కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుకు గురైన అమ్మ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అమ్మ గొంతు మూగబోయింది. అమ్మ ఇకలేరన్న వార్త విన్న తమిళ జనాలు కంటనీరు పెట్టుకున్నారు. అపోలో నుంచి అమ్మ పార్థివ దేహాన్ని పోయెస్‌గార్డెన్‌కు తరలించారు. అమ్మ మృతదేహాన్ని ప్రజల సందర్శన కోసం రాజాజీ హాలులో ఉంచనున్నట్లు అన్నాడీఎంకే తెలిపింది. 
 
అమ్మ మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ తదితర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అమ్మ మరణ వార్త విని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ షాక్‌కు గురైయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌లు అమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఐరన్ లేడీ, పురట్చి తలైవి అమ్మ లేని వార్తను అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరోగ్య శాఖా మంత్రి విద్యాసాగర్.. ఉన్నత అధికారులు అపోలో ఆస్పత్రి నుంచి వెళ్ళిపోయారు. ఎయిమ్స్ డాక్టర్లు ఢిల్లీకి వెళ్లిపోయారు. లండన్, సింగపూర్ డాక్టర్లు అమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పోయెస్ గార్డెన్‌లో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 
 
ఇకపోతే.. తమిళనాట అమ్మ మాట ఎత్తితేనే ప్రజల్లో కొత్త ఉత్సాహం. కానీ ఆ ఉత్సాహం కరువైందని ప్రజలు వాపోతున్నారు. రాజకీయ ప్రత్యర్థులకుకొరకరాని కొయ్య. అమ్మ అనుగ్రహిస్తే ఎవరినయినా అందలమెక్కిస్తుంది. ఆగ్రహిస్తే వెంటాడుతుంది. ఆమే ది గ్రేట్ జయలలిత. భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. రాజకీయంగా ఆమెను తొక్కేసేందుకు ఎందరో ప్రయత్నించారు. కానీ అందరికీ చుక్కలు చూపించి.. రాజకీయ శక్తిగా అమ్మ ఎదిగింది. 
 
కేవలం ద్రవిడ రాజకీయాలే కాదు యావత్‌ భారతదేశ రాజకీయాల్లో ఆమెసంచలనం. రాజకీయవైరం వుంటే ఎంతవరకైయినా వెళ్లగలిగే తెగువ ఆమెకు మాత్రమే చెల్లుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతారు. అన్నాడీఎంకేలో తిరుగులేని నేతగా ఆమె నిలిచారు. 
 
అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌ కన్నుమూసిన అనంతరం ఆమె పార్టీలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని.. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఎంజీఆర్‌ సతీమణి జానకీ రామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టినా నిలదొక్కుకోలేకపోయారు. అనంతరం పార్టీ జానకి, జయ వర్గాలుగా చీలిపోయింది. అనంతరం వచ్చిన 1989 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీచేశాయి. దీంతో డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంది. 
 
జానకి రామచంద్రన్‌ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఆమె వర్గం తిరిగి జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకేలో విలీనమయింది. 1991లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే శ్రీపెరంబదూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఆ తర్వాత జరిగిన ఎన్నికల పోలింగ్‌లో జయలిత సారథ్యంలో అన్నాడీఎంకే గణనీయమైన విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుంచి తమిళరాజకీయాలపై జయలలిత ముద్ర కొనసాగింది. 2001, 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ విజయబావుటా ఎగురవేశారు. ఫలితంగా నాలుగుసార్లు సీఎం బాధ్యతలు చేపట్టారు. చివరి వరకు సీఎంగానే మరణించారు. పార్టీని సమర్థవంతంగా నడిపారు.

1991 నుంచి జయలలిత అంటే అన్నాడీఎంకేగా కొనసాగింది. పార్టీలో ఎవరైనా ఆమె అభిప్రాయాలను అంగీకరించాల్సిందే. ఈ క్రమంలో అమ్మ నెచ్చెలిని కూడా పక్కనబెట్టేసింది. కానీ ఆ నెచ్చెలి అమ్మ స్నేహం కోసం కుటుంబాన్ని పక్కనబెట్టి.. అమ్మ ప్రాణాలు విడిచేంతవరకు ఆమె వెంటే ఉన్నది..  ఎంతైనా అమ్మ అమ్మే.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆశిద్దాం..