Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఖాతాదారులకు మజ్జిగ, మంచినీరు.. ఆ ఘటనపై క్షమాపణ చెప్తున్నా: డీజీపీ

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (10:29 IST)

Widgets Magazine
bank cash

పెద్ద నోట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్‌‌లో నోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బు లేకపోవడంతో సామాన్యులు అల్లాడుతున్నారు. పాత పెద్ద నోట్లను రద్దు చేసి 22 రోజులు అవుతున్నా 25 శాతం ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద బారులు తీరే ఖాతాదారుల కోసం మజ్జిగ, మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలని బ్యాంకు అధికారులను ఏపీ డీజీపీ నండూరి సాంబశివరావు ఆదేశాలు జారీ చేశారు.
 
నగరంపాలెంలోని ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచ్‌, ఏటీఎంల వద్ద క్యూలైన్లలో ఉన్న వారితో మాట్లాడారు. క్యూలైన్‌లో ఉన్న ఖాతాదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తాము ఏ నోట్లు అడిగినా బ్యాంకు అధికారులు రూ.రెండువేలు నోట్లే ఇస్తున్నారన్నారు. మరో ఖాతాదారుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినదేనని.. అయితే వృద్ధులమైన తమకు ఈ కష్టాలు ఏమిటని ప్రశ్నించారు. 
 
గంటల తరబడి క్యూ లైన్లలో తాము నిలబడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీజీపీ సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఖాతాదారుడిపై కానిస్టేబుల్‌ దాడి చేసిన ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనపై తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పోలీసులు దురుసుగా ప్రవర్తించకుండా తగు ఆదేశాలుజారీ చేస్తామన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సంపన్న మహిళకు బెదిరింపులు.. రూ.2కోట్లు ఇవ్వకపోతే.. ఆ ఫోటోలను పోర్నోగ్రాఫిక్ సైట్లలో?

మహిళలపై అఘాయిత్యాలు, వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భోపాల్‌లో ఓ మహిళ తీవ్ర ...

news

నోట్ల రద్దు కష్టాలు: మోడీ మారు వేషంలో వచ్చి.. ఇడ్లీతిని.. టీతాగి చూడాలి.. కష్టమేమిటో

ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి పూర్వం రాజులు మారు వేషాల్లో వెళ్లినట్లే.. ప్రస్తుతం ప్రధాన ...

news

బీజేపీకి బైబై చెప్పేసి వామపక్షాలతో దోస్తీకి పవన్ కల్యాణ్ రెఢీ.. 2019 ఎన్నికలే లక్ష్యం..?!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పెషల్ స్టేటస్‌పై బీజేపీ సర్కారు వ్యవహరించిన తీరుపై ...

news

రెండేళ్లు కళ్లు మూసేసుకోండి.. ఆపై వెంట్రుక కూడా కదపడం వారి తరం కాదు: జగన్

దేవుడు దయదలిస్తే ఏడాదిలో ఎన్నికలు జరగవచ్చునని లేదంటే రెండేళ్ల పాటు గట్టిగా కళ్లు ...

Widgets Magazine