మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 30 మే 2015 (21:34 IST)

ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ చైనీఫియాన్ అరెస్టు.. భారీ ఎత్తున ఎర్రచందనం స్వాధీనం

అంతర్జాతీయ స్మగ్లర్ చైనీఫియాన్ ను చిత్తూరు పోలీసులు శనివారం ఢిల్లీలో అరెస్టు చేశారు. భారీ ఎత్తున దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమచారంతో అక్కడ వెళ్ళిన పోలీసులు దుంగలపై బేరసారాలు జరుగుతున్న సమయంలో తనిఖీలు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
ఢిల్లీ శివారుల్లో ఎర్రచందనం దుంగల విక్రయం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఏపీ స్పెషల్‌ టాస్క్‌ఫోర్సు పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేయడానికి వచ్చిన చైనీఫియాన్‌ను ఢిల్లీలోని పహర్‌గంజ్‌ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఎర్రచందనంతో తయారు చేసిన బుద్ధుడి విగ్రహం సహా భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.