శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 1 ఆగస్టు 2015 (17:14 IST)

కర్మయోగి కలాం... ఆస్తులు లేవు.. వీలునామా లేదు... పెన్షన్ కూడా దానం...

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తనకంటూ ఏదీ దాచుకున్నది, వెనకేసుకున్న ఆస్తులు ఏమీ లేవు. దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతిని అధిరోహించడమే కాకుండా అంతకుముందు శాస్త్రవేత్తగా పనిచేసినప్పటికీ ఆయన ఆస్తులను కూడబెట్టలేదు. తనకు వచ్చే సంపదనంతా పేదలకు దానధర్మాలు చేసేశారు. తను రాష్ట్రపతి కాగానే ఇక తన ఖర్చులన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని తెలుసుకున్న అబ్దుల్ కలాం ఉద్యోగం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును ధార్మిక సంస్థలకు విరాళంగా ఇచ్చేశారు. 
 
తన తల్లిదండ్రులు తాతముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తులకు కూడా కలాం ఎలాంటి వీలునామాలు, పత్రాలు రాయనేలేదు. ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా మాత్రం మసీదులో షీర్ కుర్మా పంపిణీకి గాను రూ. 1.10 లక్షలను తమకు పంపించేవారనీ, వాటిని మసీదు పెద్దలకు అందించేవారమని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
తమకు ఈ ఏడాది ఎందుకో తెలియదు కానీ తన పెన్షన్ డబ్బును రంజాన్ సందర్భంగా కొత్త బట్టలు కొని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. తమ పూర్వీకులు పడవలు నడిపేవారనీ, ఆ తర్వాత అక్కడ వంతెన నిర్మాణం కావడంతో తమ పరిస్థితి తలకిందులైందని, ప్రస్తుతం ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ బతుకుబండి లాగుతున్నట్లు చెప్పుకొచ్చారు.