బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (19:32 IST)

అమ్మ చనిపోయినట్టు జయ టీవీనే బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేసింది...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయినట్టు తొలుత బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేసింది అన్నాడీఎంకేకు చెందిన జయ న్యూస్ టీవీనే కావడం గమనార్హం. ఆ టీవీ స్క్రోలింగ్‌ను చూసిన తర్వాతే మిగిలిన తమిళ చానెల్స్‌తో పాటు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చనిపోయినట్టు తొలుత బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేసింది అన్నాడీఎంకేకు చెందిన జయ న్యూస్ టీవీనే కావడం గమనార్హం. ఆ టీవీ స్క్రోలింగ్‌ను చూసిన తర్వాతే మిగిలిన తమిళ చానెల్స్‌తో పాటు కొన్ని తెలుగు, ఇంగ్లీష్ చానెల్స్ బ్రేకింగ్‌ న్యూస్‌ను ప్రసారం చేశాయి. దీంతో అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో కూడా పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. 
 
ఇంతలో జయ మృతి వార్తను తట్టుకోలేని అభిమానులు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డారు. పరిస్థితి గాడి తప్పుతోందని గ్రహించిన తమిళ సర్కారు జయలలిత మరణ వార్త నిజం కాదని చెప్పాల్సిందిగా అపోలో వైద్యులకు సూచించినట్లు తెలిసింది. దీంతో జయకు ఎయిమ్స్ వైద్యులు చికిత్స చేస్తున్నట్లు అపోలో వైద్యులు తాజా ప్రకటన చేశారు.
 
పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత ఏ క్షణానైనా అసలు విషయాన్ని అధికారికంగా ఆసుపత్రి వర్గాలు ప్రకటిస్తాయి. ఇదిలావుంటే జయలలిత పూర్తిగా కోలుకున్నారని, ఇక ఇంటికి వెళ్లడం ఎప్పుడనేది జయలలితే నిర్ణయించుకోవాలని ఇటీవలే అపోలో వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఆమె పరిస్థితి తీవ్రంగా విషమించిందంటూ స్వయంగా అపోలో వర్గాలు, లండన్ వైద్యుడు రిచర్డ్స్ కూడా ట్వీట్లు చేయడంతో తమిళ ప్రజలు పూర్తి అయోమయంలో పడ్డారు. తమను మోసగిస్తున్నారంటూ అందరిపైనా మండిపడుతున్నారు.