శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (12:57 IST)

అపోలో హెల్త్‌బులిటెన్ : జయలలితకు ఎక్మో ట్రీట్మెంట్.. వెరీ క్రిటికల్ కండీషన్... గుండెపోటుతో అభిమాని మృతి

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెన్నై అపోలో ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం కార్డియాక్ అరెస్ట్‌కు

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెన్నై అపోలో ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం కార్డియాక్ అరెస్ట్‌కు గురైన జయలలితను క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి ఈసీఎంవో (ఎక్మో) పరికరం ద్వారా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని అధికారికంగానే ప్రకటించారు. అంతేకాకుండా, ఆమె ఆరోగ్యంపై సోమవారం సాయంత్రం 5 గంటలకు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనున్నట్టు అపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
మరోవైపు.. జయలలిత ఆరోగ్యంపై టీవీలో వస్తున్న వార్తలు చూసి ఆందోళనకు గురైన ఓ అన్నాడీఎంకే కార్యకర్త గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని కడలూరి జిల్లాలో చోటు చేసుకుంది. తమిళనాడులోని కడలూరి జిల్లా సన్యాసిపేటకు చెందిన నీలగండన్ అనే వ్యక్తి అన్నాడీఎంకేలో కీలక కార్యకర్తగా ఉన్నారు. సోమవారం ఉదయం టీవీలో జయలలితను చూసిన నీలగండన్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే 108లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తుండగా మరణించారు.