Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియుడితో సహజీవనం... గర్భవతి అని తెలిసినా కొట్టి చంపిన తల్లిదండ్రులు..

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (11:16 IST)

Widgets Magazine
murder

భర్తతో బలవంతపు కాపురం చేయలేక ప్రియుడితో కలిసి సహజీనం చేస్తూ వచ్చిన కుమార్తెను తల్లిదండ్రులు వెతికిపట్టుకునివచ్చి కొట్టి చంపారు. ఈ పరువు హత్య తమిళనాడు రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లా సెందురైలో ఓ యువతి మరో కులానికి చెందిన చెందిన యువకుడిని ప్రేమించింది. వీరిద్దరు గత 2008లో ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. అయితే షర్మిల కుటుంబీకులు ఆమెను వెతికి పట్టుకొచ్చిమరీ.. సమీప బంధువైన అన్బుమణితో బలవంతపు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత భర్తతో అయిష్టంగానే కాపురం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది. 
 
అయితే, బలవంతపు కాపురం చేయడం ఇష్టంలేక... 2013లో మరోసారి ఇంట్లోంచి పారిపోయి ప్రియుడి చెంతకు చేరింది. అప్పటినుంచి ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆ మహిళ ఈ క్రమంలో షర్మిల మరోసారి గర్భందాల్చింది. అయితే షర్మిల కోసం మరోసారి వేట ప్రారంభించిన ఆమె కుటుంబ సభ్యులు.. ఆమె ఆచూకీ కనుగొన్నారు. మాయ మాటలతో నమ్మబలికిన తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. 
 
ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి కలైరాజన్‌ను అల్లుడిగా స్వీకరించేందుకు అంగీకరించారు. అనంతరం షర్మిలను ఇంటికి తీసుకుని వెళ్లారు. ఇది జరిగిన రోజు రాత్రే షర్మిల విగతజీవిగా కనిపించింది. పైగా దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగుచూసింది. షర్మిలను ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. గర్భం తొలగించుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. షర్మిల ససేమిరా అనడంతో ఆమెను తీవ్రంగా కొట్టి హతమార్చారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చంద్రబాబును చంపేస్తాం - మావోయిస్టుల రెక్కీ..?

ఇప్పటికీ అలిపిరి బాంబు దాడిని తలుచుకుంటే వణికిపోతుంటారు చంద్రబాబు. చావుకు దగ్గరగా వెళ్ళి ...

news

ఆంటీని కలిసేందుకు దినకరన్... కారు దిగితే అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు... 7777 కారులో ఎస్కేప్...

టిటివి దినకరన్ నిన్న తన ఆంటీ శశికళను బెంగళూరులోని పరప్పన జైలులో కలిసి పరిస్థితిని ...

news

అమెరికాపై దాడికి రె ''ఢీ''-క్షిపణికి క్షిపణితో- అణుదాడికి.. అణుదాడితో.. బదులిస్తాం.. ఉత్తర కొరియా

సిరియాపై దాడికి తర్వాత ఉత్తర కొరియా అమెరికాను టార్గెట్ చేసింది. అమెరికాపై దాడి చేసేందుకు ...

news

మరో పదేళ్ల పాటు కేసీఆరే సీఎం.. హరీష్‌ రావుతో విభేదాల్లేవ్: కేటీఆర్

మరో పదేళ్ల పాటు తెలంగాణ సీఎంగా కేసీఆరే ఉంటారని.. మరో మంత్రి హరీష్ రావు, తనకు మధ్య ఎలాంటి ...

Widgets Magazine