శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (16:16 IST)

ఉగ్రవాదుల దాడి: ఆర్మీ అధికారి, ముగ్గురు పౌరుల మృతి

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని దేశ సరిహద్దులో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. కాల్పులతో భారత సైన్యంపైకి తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఒక జవాను, ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారత సైన్యం జరిపిన ఎదురు దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. 
 
జమ్మూకాశ్మీర్‌లోని ఆర్నియా సెక్టార్‌లో ఉగ్రవాదులు గురువారం కాల్పులు తెగబడిన విషయం తెల్సిందే. భారత ఆర్మీ బంకర్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రవాదులు బుధవారం రాత్రే బంకర్లలో చొరబడినట్లు అనుమానిస్తున్నారు. నలుగురు ఉగ్రవాదులు ఆయుధాలతో సరిహద్దుల్లోకి చొరబడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
 
కాల్పుల ఘటనపై స్పందించిన జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. నేపాల్‌లో జరుగుతున్న సార్క్ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ హాజరైన నేపథ్యంలో ఈ ఘటన యాధృశ్చికంగా జరగలేదని అన్నారు. కాల్పుల్లో మృతి చెందిన జవాన్లకు ఒమర్ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు.